YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మంత్రులకు డిన్నర్ పార్టీ...

మంత్రులకు డిన్నర్ పార్టీ...

హైదరాబాద్, మే 29, 
తెలంగాణ కేబినెట్ విస్తరణ మళ్లీ ముహూర్తం వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరో ఆసక్తికర పరిణామం జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులందరికి తన ఇంట్లో డిన్నర్ పార్టీ ఇవ్వడంతో మళ్లీ కేబినెట్‌ అంశం తెరపైకొచ్చింది.సీఎం పిలుపుతో మంత్రివర్గం కదిలింది..! మా ఇంటికొచ్చి విందు ఆరగించి పోండి అన్న ఆహ్వానంతో దాదాపుగా మంత్రివర్గం మొత్తం సీఎం ఇంట్లో వాలిపోయింది. ముఖ్యమంత్రి ఇచ్చిన విందును ఆరగించింది..! అంతా ఓకే కానీ.. ఇప్పుడే ఈ డిన్నర్‌ ఎందుకు..?  సీఎం ఢిల్లీ వెళ్లనుండటంతో సడెన్‌గా ఈ విందు ఏర్పాటేంటి..? విందు పేరుతో మంత్రులంతా ఏం చర్చించారు..? సీఎం వాళ్లకు ఏం చెప్పారు..? ఇప్పుడీ అంశాలే ఆసక్తిని పెంచుతున్నాయి. కేబినెట్‌ బెర్త్‌ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న నేతల్లో మరింత ఉత్కంఠ రేపుతున్నాయి.మొన్ననే మంత్రివర్గ విస్తరణ దాదాపుగా పూర్తైందని.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అందుబాటులో లేకపోవడంతో ప్రకటన వాయిదా పడిందని పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. ఖర్గే ఈనెల 30న అంటే రేపు ఢిల్లీలో ల్యాండ్‌ అవుతారు. అలాగే ఇట్నుంచి సీఎం రేవంత్‌ రెడ్డి కూడా రేపే హస్తినకు వెళ్తారు. దీంతో ఇన్నాళ్ల నిరీక్షణకు రేపు ఎండ్‌ కార్డ్‌ పడబోతోందన్న ప్రచారం గట్టిగా నడుస్తోంది. ఆ కేబినెట్‌ విస్తరణ ఊహాగానాల నేపథ్యంలోనే ఈ ప్రైవేట్ డిన్నర్‌పై తెలంగాణ కాంగ్రెస్‌లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. విస్తరణకు ముందు సీఎం ఆనవాయితీగా ఇస్తున్న డిన్నర్‌ అంటూ కూడా బయట టాక్‌ వినిపిస్తోంది.నేను మంత్రినవుతా.. నేను మంత్రినవుతా ఇప్పటికే ఎంతోమంది బడా నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎన్నో ప్రయత్నాలు చేశారు. మంత్రిపదవి కోసం పార్టీకే అల్టిమేటం జారీ చేసిన నేతలూ ఉన్నారు. వాళ్లంతా ఈ డిన్నర్‌ మీటింగ్‌ని ఆసక్తిగా తిలకించారు. మంత్రివర్గ విస్తరణపైనే మాట్లాడారంటూ చర్చించుకుంటున్నారు. ఆ లిస్ట్‌లో తమ పేరు ఉందో లేదోనన్న టెన్షన్‌లో పడ్డారు నేతలు. మొత్తంగా.. సీఎం డిన్నర్ పార్టీపై ఓవైపు ఆసక్తి.. మరోవైపు నేతల్లో ఉత్కంఠ నెలకొంది.

Related Posts