YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కవిత పార్టీ... ఎవరికి ప్లస్... ఎవరికి మైనస్

కవిత పార్టీ... ఎవరికి ప్లస్... ఎవరికి మైనస్

హైదరాబాద్, మే 29, 
ఎప్పుడైతే గులాబీ సుప్రీమ్ ను ఉద్దేశించి కల్వకుంట్ల కవిత లేఖలు రాసిందో.. అప్పటినుంచి కారు పార్టీలో కుతకుతలు మొదలవుతున్నాయి. బయటికి పెద్దగా తెలియడం లేదు గాని.. లోపల మాత్రం ఊహించని పరిణామాలు వీటన్నింటినీ గులాబీ శ్రేణులు అత్యంత సులభంగా కొట్టిపారేస్తున్నాయి కానీ.. అంతకుమించి అనేలాగా ఏదో విస్ఫోటనం జరుగుతోంది. మీడియాలో వస్తున్నట్టుగానే.. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగానే కవిత ఒకవేళ సొంతంగా పార్టీ పెడితే పరిస్థితి ఎలా ఉంటుంది? కెసిఆర్ కు అది ఎలాంటి ఇబ్బందికరంగా మారుతుంది? కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి లాభం చేకూర్చుతుంది? అనే ప్రశ్నలు తెలంగాణలో హాట్ హాట్ చర్చకు కారణం అవుతున్నాయి. ఒకవేళ కవిత కనక పార్టీ నుంచి వెళ్ళిపోతే.. ఢిల్లీ మద్యం కుంభకోణం ముద్ర ఆమె రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందికరంగా మారుతుందని కొందరు అంటున్నారు. అంతేకాదు కుటుంబ పార్టీ అనే ట్యాగ్ లైన్ కూడా దూరమవుతుందని.. పార్టీ ప్రయోజనాల కోసం కేసీఆర్ కుమార్తెను కూడా వదులుకున్నాడని.. బూస్ట్ పార్టీకి లభిస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.ఒకవేళ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ ఢిల్లీ మద్యం కుంభకోణం తాలూకు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తే.. దానికి కెసిఆర్ కూడా సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే కవిత పార్టీ నుంచి బయటికి వస్తే కచ్చితంగా కొన్ని నిజాలు బయటికి తెలుస్తాయి. అవి కేసీఆర్ ను ఏదో చేస్తాయని కాదు.. కాకపోతే ఇప్పటికే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న పార్టీని మరింత గందరగోళంలోకి నెడతాయి. అప్పుడు కెసిఆర్ కు మరింత ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక కేటీఆర్ కు కనుక పార్టీ సర్వ పగ్గాలు అప్పగిస్తే.. అప్పుడు ఆయన నాయకత్వం నచ్చని మరో కీలక వ్యక్తి బయటికి వచ్చి.. కవితతో కలిసి తిరుగుజెండా ఎగరవేస్తే మాత్రం అప్పుడు మరింత డోలాయమానం పార్టీకి ఎదురవుతుంది. ఇవన్నీ కెసిఆర్ చూస్తూ ఉంటారా.. ఊరకనే ఉంటారా.. ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి. మనదేశంలో పీవీ నరసింహారావు వంటి వ్యక్తి కోర్టుకు హాజరయ్యారు. కమిషన్ ముందు నిలబడ్డారు. ఆ లెక్కలోకి వస్తే కేసీఆర్ కమిషన్ ఎదుట హాజరు కావడం పెద్ద విషయం కాదు. కాకపోతే రేవంత్ రెడ్డి కాళేశ్వరం ఇష్యూ ను జనంలోకి ఎలా తీసుకుపోతాడు అనేది చాలా ముఖ్యం. ఇప్పటికే కాలేశ్వరం జలాలు లేకుండా యాసంగిలో రికార్డు స్థాయిలో వరి పంట పండించామని కాంగ్రెస్ చెబుతోంది. మరోవైపు కాళేశ్వరం అలా కుంగిపోవడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు బాంబులు వేసి ఉండొచ్చని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఇన్ని పరిణామాల మధ్య భవిష్యత్తు కాలంలో బిజెపితో కనుక కారు పార్టీ సయోధ్య కుదుర్చుకుంటే.. అప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కెసిఆర్ ముఖాముఖి పోరాడాల్సి ఉంటుంది..ఇన్ని పరిణామాలు జరుగుతుంటే గులాబీ నాయకులు సైలెంట్ గా ఉన్నారు. కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు నిశ్శబ్దాన్ని ఆశ్రయిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల కల్వకుంట్ల కవిత రాసిన లేఖల వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి ఆడిస్తున్న డ్రామాగా వారు ఆరోపించారు. కానీ స్వయంగా ఆ లేఖలను తానే రాశానని కల్వకుంట్ల కవిత ఒప్పుకోవడంతో వారంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. దీనికి తోడు అధిష్టానం నుంచి కూడా ఆదేశాలు రావడంతో ఎవరూ ఎటువంటి మాటలు మాట్లాడటం లేదు. అంతటి కేటీఆర్ కూడా ఏదో పరోక్షంగా వ్యాఖ్యానించాడు గాని.. నేరుగా మాట్లాడటానికి.. నేరుగా విమర్శలు చేయడానికి సాహసించలేదు.  భారత రాష్ట్ర సమితిలో భవిష్యత్తు కాలంలో జరుగుతున్న మార్పులు ఎలాంటి ప్రభావం చూపిస్తోందో  మరి చూడాలి

Related Posts