
హైదరాబాద్
ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లడిస్తున్నారు. నా జోలికొస్తే బాగోదు.. కేసీఆర్ ను మేమే నడిపిస్తున్నామని కొందరు చెప్పుకుంటున్నారు. నా లేఖ లీక్ చేసిందెవరో చెప్పాలని అన్నారు. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే ఎందుకు నిరసనలు తెలపలేదు. ఇంకో నేతకు నోటీసులు ఇస్తే ఎందుకు హంగామా చేశారు. పార్టీ చేయాల్సిన పనులు జాగృతి తరుపున నేనే చేస్తున్నా. బిఆర్ ఎస్ ను బీజెపిలో విలీనం చేసే కుట్ర జరుగుతోంది. నామీద పడి ఏడిస్తే ఏమోస్తుంది. కాంగ్రెస్ మునిగిపోయే నావ. ఆ పార్టీతో రాయబారాలు నాకెందుకు. నాపై తప్పుడు వార్తలను పార్టీ ఎందుకు ఖండించడంలేదు. బీఆర్ ఎస్ లో కేసీఆర్ తప్ప ఇంకెవరీ నాయకత్వం అంగీకరించను. నాది బిఆర్ ఎస్ పార్టీ. నేను జైలులో ఉన్నప్పుడే నాపై కుట్ర జరిగింది. జైలుకు వెళ్లేటప్పుడు పార్టీకి రాజీనామీ చేస్తానని చెప్పా. పార్టీ సోషల్ మీడియాలో నన్ను టార్గెట్ చేశారని అన్నారు.