
నెల్లూరు జూన్4,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. ఇకపై ప్రజలు కరెంట్ బిల్లుల్ని చాలా సులభంగా కట్టేయొచ్చు. విద్యుత్ బిల్లులు కట్టేందుకు విద్యుత్ శాఖ కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై జస్ట్ క్యూఆర్ కోడ్ ద్వారా బిల్లులు చెల్లించవచ్చు. ఈ విధానం జూన్ నెల నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. గతంలో ఫోన్ పే, గూగుల్ పే వంటి వాటి ద్వారా కరెంట్ బిల్లులు కట్టే విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ క్రమంలో ప్రజలు బిల్లులు కట్టడానికి మళ్ళీ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చింది. తాజాగా ఈ సమస్యను అధిగమించడానికి క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకొచ్చారు.క్యూఆర్ కోడ్ ద్వారా బిల్లులు చెల్లించే విధానం వల్ల ప్రజలకు చాలా సులువు అంటున్నారు. ఈ నెలలో జారీ చేస్తున్న విద్యుత్ బిల్లుల్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది.. ఆ కోడ్‌ను ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్‌ల ద్వారా స్కాన్ చేయాలి. వెంటనే బిల్లు మొత్తం కనిపిస్తుంది.. వినియోగదారుడు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓకే చేస్తే బిల్లు చెల్లింపు పూర్తవుతుంది. ఈ సరికొత్త విధానం ప్రభుత్వ సర్వీసులకు వర్తించదని తెలుస్తోంది. బకాయిలు ఉన్న వినియోగదారులకు కూడా ఈ అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. అలాగే గత నెల బిల్లు చెల్లించకపోతే.. ఈ నెల బిల్లులో క్యూఆర్ కోడ్ కనిపించదంటున్నారు అధికారులు.ఈ క్యూఆర్ కోడ్‌తో ప్రజలకు విద్యుత్ సేవలను మరింత చేరువ చేసేందుకు.. ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చామని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ సర్వీసులు మినహా అన్ని ప్రైవేటు సర్వీసులకు ఈ విధానం వర్తిస్తుంది.. బిల్లులు ఎలా చెల్లించాలో బిల్లు రీడర్స్ వినియోగదారులకు అవగాహన కల్పిస్తారు. క్యూఆర్ కోడ్ ద్వారా విద్యుత్ బిల్లు చెల్లించడం చాలా సులువుగా ఉందని వినియోగదారులు అంటున్నారు. ఫోన్‌పేలో డబ్బులు ఉంటే ఎప్పుడైనా బిల్లు చెల్లించవచ్చని.. దీని ద్వారా సమయం ఆదా అవుతుందంటున్నారు. బిల్లు చెల్లింపు కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదంటున్నారు.
విద్యుత్ సేవలు వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు క్యూఆర్‌కోడ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాము అంటున్నారు అధికారులు. కరెంట్ బిల్లులు ఎలా చెల్లించాలో బిల్లు రీడర్స్ వినియోగాదారులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. మొత్తం మీద ఇకపై కరెంట్ బిల్లులు చెల్లించడం చాలా ఈజీ అయ్యింది. సింపుల్‌గా కరెంట్ బిల్లుపై ఉండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సరిపోతుంది. ఇక ఎక్కడికి వెళ్లాల్సిన పని ఉండదు.. చక్కగా ఇంట్లో కూర్చుని కరెంట్ బిల్లుల్ని ప్రతి నెలా చెల్లించొచ్చు.