
నిజామాబాద్, జూన్ 4,
ఆమె యాక్షన్‌కి… ఈయన రియాక్షన్. అప్పుడైనా…ఇప్పుడైనా… ఆమెకి కౌంటర్ వేసేది ఆయనేనా..? పార్టీ ఇక ఫుల్ పవర్స్ ఇచ్చేసిందా? అట్నుంచి ఎప్పుడు పొలిటికల్ మిసైల్ వదిలినా…. మన పార్టీకి ఎస్ 400లా అడ్డుకోవాల్సింది నువ్వేనని అధిష్టానం చెప్పేసిందా? ఇంతకీ ఎవరా ఇద్దరు నేతలు? వాళ్ళ మధ్యనే పొలిటికల్ యుద్ధం ఎందుకు ఎక్కువగా జరుగుతోంది? తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ అంటే…. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇష్యూ నే. బీజేపీ…కాంగ్రెస్ అంటూ మాటల తూటాలు ఎక్కు పెడుతున్నారామె. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి టార్గెట్ గా… ఆరోపణలు గుప్పిస్తున్నారు. తెలంగాణ సంస్కృతిని ధ్వంసం చేసే కుట్ర జరుగుతోందని ఫైరై పోతున్నారు కవిత. ఆమె పరంగా వ్యవహారం అలా ఉంటే… ఇటు కాంగ్రెస్‌వైపు నుంచి మాత్రం పెద్దగా ఎవరూ రియాక్ట్ అవ్వొద్దన్న అనధికార ఆదేశాలున్నాయట. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ని టార్గెట్ చేస్తున్నా…. ఆమె విషయంలో అట్నుంచి ఇంతవరకు రియాక్షన్ రానప్పుడు మనం మాత్రం స్పందించడం ఎందుకని అనుకుంటున్నారట కాంగ్రెస్ లీడర్స్. అయితే… తాజాగా మాజీ ఎంపీ మధు యాష్కీ రియాక్ట్ అవడంతో ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు. గతంలో కూడా కవితపై మాట్లాడాలంటే… ముందుండే వారు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ. ఇద్దరు నేతలు గతంలో నిజామాబాద్ ఎంపీలుగా పనిచేసిన వారే. ఇద్దరి మధ్య రాజకీయ వైరం అక్కడి నుంచే ఉందని అంటున్నారు పరిశీలకులు. కవిత, యాష్కీ మధ్య నిజామాబాద్‌లో మొదలైన యుద్ధం ఇప్పుడు హైదరాబాద్ చేరినట్టు చెప్పుకుంటున్నారు. మొదట్నుంచి కూడా కవిత చేసే విమర్శలపై మధుయాష్కీనే ఎక్కువగా స్పందిస్తున్నారు.ఈ క్రమంలో వరుసగా… వారం రోజులుగా సాగుతున్న వ్యవహారం పై.. సీరియస్ గానే స్పందించారు మధు యాష్కి. లిక్కర్ క్వీన్ కవిత బీజేపీ వదిలిన బాణమేనంటూ…ఘాటుగా స్పందించారాయన. లిక్కర్ కేసునుండి బయట పడటానికి బీజేపీ సహకారం కవితకే కావాలని, ఆమె మీద నిజామాబాద్ లో gst స్కామ్ కూడా ఉందని ఆరోపించారు యాష్కీ. తన అవినీతిని కప్పి పుచ్చుకోవడానికే ఆమె పొలిటికల్ డ్రామాలు మొదలుపెట్టారంటూ అటాక్ చేశారు కాంగ్రెస్ మాజీ ఎంపీ. ఆమె సొంత సంస్థ జాగృతిలో… 800 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ బాంబు పేల్చారాయన. జాగృతి మీద విచారణ జరిపించాలని, ఆ దిశగా సీఎం రేవంత్ ఆదేశించాలని కూడా కోరారు మధు యాష్కి. అసలామెను కాంగ్రెస్‌లో చేర్చుకొనేంత అంత ఖర్మ మాకు పట్టలేదంటూ స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారాయన. మొత్తం మీద కవిత విషయంలో ఇన్నాళ్లు సమయమనం పాటించిన కాంగ్రెస్ పార్టీ తమ తరపున కౌంటర్ వేయడానికి మధు యాష్కీకి ఫుల్ పవర్స్ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. నిజామాబాద్ ఎంపీ సీట్లో ఇద్దరికీ డైరెక్ట్ ఫైట్ ఉన్నందున ఆయనే కరెక్ట్ అని భావిస్తున్నారట కాంగ్రెస్ పెద్దలు. మరీ స్పందించకుండా ఉన్నా.. ఇబ్బందే కాబట్టి… అవసరమైనట్టు, సందర్భానికి తగ్గట్టుగా కవిత చేసే ఆరోపణలకు కౌంటర్స్ వేసే బాధ్యతను మధుకు అప్పగించారట కాంగ్రెస్ పెద్దలు.