
హైదరాబాద్, జూన్ 5,
BRS పార్టీలో ఏం జరుగుతోంది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంలో ఏం జరగబోతోంది. కవిత విషయంలో నెక్ట్స్ ఏంటి.. షోకాజ్ నోటీసులు ఇస్తారా.. ఇవ్వరా.., కవితపై చర్యలు తీసుకుంటారా లేదా.. ఇంతకీ కవిత కొత్త పార్టీ పెడుతుందా.. ఇలా ఎన్నో ప్రశ్నలు .. ఇన్నాళ్లు లక్షలాది మెదళ్లను కదిలిస్తూనే ఉన్నాయి. కానీ తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే..ఈ ప్రశ్నలకు సమాధానం మాత్రం దొరకదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.మే 2 వతేదిన బీఆర్ ఎస్ పార్టీ అధినేత, తన తండ్రి కేసీఆర్ కు ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత లేఖరాశారు. మైడియర్ డాడీ అంటూ మొదలుపెట్టి, మీరు అలా మాట్లాడటం బాగుంది, కానీ ఇలా కూడా మాట్లాడవలసింది. బిజెపితో దోస్తీ అనే అనుమానం రాకుండా విమర్శల డోస్ పెంచాల్సింది. అంటూ బిఆర్ఎస్ వరంగల్ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగంపై , పార్టీలో అనుమానాలు , కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయంపై లేఖలో వివరిస్తూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు..మే 22వ తేది.. సరిగ్గా లేఖ రాసిన ఇరవైరోజుల తరువాత కవిత రాసిన లేఖ లీకైయ్యింది. మీడియా చేతికి కవిత తండ్రికి రాసిన సీక్రెట్ లేఖ చిక్కింది. ఇంకేముంది వరుస కథనాలతో మీడియా హోరెత్తించింది. పార్టీలో ఇన్నాళ్లు గుట్టుచప్పుడుకాకుండా ఉన్న లోపాలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. మే 23వ తేది.. అమెరికా పర్యటన తిరుగు ప్రయాణంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న కవిత మీడియాతో మాట్లడారు. తాను రాసిన లేఖ లీక్ పై ప్రశ్నించిన మీడియా సైతం అవక్కాయ్యేలా సొంత పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. తన తండ్రి కేసీఆర్ దేవుడు అంటూ మొదలుపెట్టి, ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలున్నాయి, పార్టీ నుండి కోవర్టులను బయటకు పంపాలి. తాను తన తండ్రికి రాసిన లేఖను లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.మే 29వ తేది.. నేను జైలులో ఉన్నప్పుడు బిజెపిలో బిఆర్ ఎస్ విలీనం చేసేందుకు సిద్దమైయ్యారు. ఆ ప్రయత్నాన్ని నేనే అడ్డుకున్నానంటూ తెలంగాణ రాజకీయాల్లో గ్రానేడ్ పేల్చింది. నా జోలికొస్తే బాగోదు. నాపై విదేశాల నుండి బీఆర్ ఎస్ సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేయిస్తున్నారంటూ మీడియా చిట్ చాట్ లో తీవ్ర పదజాలంతో సొంత పార్టీ నేతల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు కవిత. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే స్పందించలేదు కానీ, మరో నేతకు నోటీసులు ఇస్తే నానా హంగామా చేస్తారా అంటూ నేరుగా అన్న కేటీఆర్, బావ హరీష్ రావులను టార్గెట్ చేశారు.ఇదే చివరిగా బీఆర్ ఎస్ పార్టీపై కవిత చేసిన విమర్శలు. నేరుగా మీడియా కెమెరాల ముందు ఓసారి, చిట్ చాట్ పేరుతో మరోసారి సొంత పార్టీలో పరిణామాలపై విరుచుకుపడిన కవిత, ఆ దెయ్యాల వల్లే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని ధిక్కార స్వరంతో మాట్లాడిన కవిత. ఆ తరువాత మూడు సార్లు మీడియా సమావేశాల్లో మాట్లాడినా, ఎక్కడా పార్టీ ఊసే తేలేదు. దెయ్యాల విషయం తేల్చాలంటూ ప్రశ్నించలేదు. లేఖ లీకు వీరుల మాటెత్తలేదు. ఇదిలా ఉంటే గతంలో ఎన్నడూ లేనట్లుగా మే 31వ తేది తెలంగాణ జాగృతి నూతన కార్యాలయం ప్రారంభించారు. కేసీఆర్ కు కాళేశ్వరంపై నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణకు నోటీసులు ఇవ్వడమేనంటూ, ఈనెల 4వ తేదిన మహాధర్నాకు పిలుపునిచ్చారు.ఇలా పార్టీపై తీవ్ర ధిక్కార స్వరంతో మే 23వ తేదిన మొాదలైన కవిత ఎపిసోడ్ కు కేవలం ఆరే ఆరు రోజుల్లో గతనెల 29వ తేదితో బ్రేక్ పడింది. ఈ బ్రేక్ తాత్కాలికమా లేక శాశ్వతమా అనేది క్లారిటీ లేదుకానీ ,ఒక్కటైతే స్పష్టమవుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతన్నారింతన్నారే.. అన్నట్లుగా కవిత వ్యాఖ్యలతో బిఆర్ ఎస్ లో లీకు వీరులపై చర్యలు తీసుకుంటారు, లేదా కవితకు షోకాజ్ ఇస్తారు అనే ప్రచారం జరిగింది. వడ్డించేవాడు మనవాడైతే.. బంతిలో చివరిన కూర్చున్నా అన్నీ అందుతాయనే సామతే ఉండేనే ఉంది. అచ్చం ఆ సామెతను తలదన్నేలా ., కవిత ఎపిసోడ్ ముగిసిందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. చిట్ చాట్ లో మాట్లడిన మాటలపై షోకాజ్ ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు. కానీ శంషాబాద్ ఎయిర్ పోర్టు సాక్షిగా మీడియా కెమెరాల ముందు కేసీఆర్ చుట్టూ దెయ్యాలు అంటూ పార్టీ పరువు పోయేలా మాట్లడారు కవిత. కేసీఆర్ ను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ అధినేత పార్టీ నడుపుతున్న తీరునే ప్రశ్నించారు. ఇలా పార్టీ లైన్ దాటినా మరి షోకాజ్ ఎందుకు ఇవ్వలేదనేవారు లేకపోలేదు. అదే మరో నేత బిఆర్ ఎస్ కవితలా విమర్శలు చేస్తే పార్టీ నుండి సాగనంపి వారం దాటేది అన్నవారు లేకపోలేదు. బిఆర్ ఎస్ పార్టీలో తన తండ్రి చుట్టూ దెయ్యాలున్నాయి అంటూ మొదలైన కవిత ఆగ్రహం, తెలంగాణ జాగృతి నూతన కార్యాలయం ఏర్పాటుతో వేరు కుంపటి పెట్టడం, కేసీఆర్ కు జాగృతి రెండో కన్ను అనడం, జాగృతీ జిల్లా నేతలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంతో బీఆర్ ఎస్ కు దూరమైయ్యారు.తాజాగా మరో అడుగు ముందుకేసి బీఆర్ ఎస్ బాస్ నోటీసులకు నిరసనగా, బీఆర్ ఎస్ చేయాల్సిన నిరసనలు తాను బుజానకెత్తుకుని, జాగృతి ఆధ్వర్యంలో మహాధర్నాకు పిలుపునివ్వడం చూస్తుంటే, బీఆర్ ఎస్ లో కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలను జాగృతీ మంత్రంతో వదిలించినట్లయ్యిందనే విమర్శలొస్తున్నాయి. సొంత కుంపటి కోసం ఇంత రాద్దాంతం అవసరమా అనే వాదనలు విపిస్తున్నాయి.