YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

దూమారం లేపుతున్న ఎమ్మెల్యే ముడుపుల వీడియో

దూమారం లేపుతున్న ఎమ్మెల్యే ముడుపుల వీడియో

నల్గోండ
ప్రజాసేవ చేయడానికి ఎన్నికైన ఓ ఎమ్మెల్యే.. ముడుపుల వసూళ్ల కోసం సొంటింట్లోనే వైన్స్ సిండికేట్ దుకాణాల దారులతో సమావేశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. "కోట్ల రూపాయలు పెట్టి ఎన్నికల్లో గెలిచాం.. ఆ ఖర్చులన్నీ ఎక్కడినుంచి వస్తాయి..? ఎవరేం చేసినా నాకు రావాల్సిన డబ్బులు రావాల్సిందే. వైన్స్ సిండికేట్ నుంచి ముడుపులకు సదరు ఎమ్మెల్యే డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ సిండికేట్లలో ఒకరు వీడియో అంతా రికార్డు చేశారు. దాంట్లో సదరు ఎమ్మెల్యే ముఖం కనిపించినప్పటికీ.. ఆయన మాటలు స్పష్టంగా వినిపించాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. "ఈరోజు, రేపు ఎవరి సొక్కo, సుద్ద పూస.. తనకు మర్యాద ఇవ్వకుంటే ఎదుటి వారికి బే అవుతుందని ఏకంగా వార్నింగ్ ఇచ్చాడు సదరు ఎమ్మెల్యే. ఎదుటివాడు నాకు ఫోన్ చేసి మాట్లాడే దమ్ము ఉండాలి కదా అంటూ చెప్పుకొచ్చాడు. కోట్ల రూపాయలు పెట్టి గెలిచాం. బండి డీజిల్ ఖర్చులకే లక్షల రూపాయలు అవుతుంది.. అని వైన్స్ షాప్ సిండికేట్ వ్యాపారస్తులతో స్పష్టం చేశారు సదరు ఎమ్మెల్యే. వైన్స్ సిండికేట్లతో బేరసారాలకు దిగిన ఉమ్మడి నల్లగొండ జిల్లా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే వీడియో గుట్టు రట్టు చేసి.. సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తుంది ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ.

Related Posts