YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మంచు విష్ణు బ్రాహ్మణ సమాజానికి తక్షణమే క్షమాపణ చెప్పాలి

మంచు విష్ణు బ్రాహ్మణ సమాజానికి తక్షణమే క్షమాపణ చెప్పాలి

మల్కాజిగిరి
మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప సినిమాలోని కొన్ని సన్నివేశాలు బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఉన్నాయని , తక్షణమే కన్నప్ప సినిమాను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మల్కాజిగిరి బ్రాహ్మణ సంఘాలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సనాతన ధర్మం పరిరక్షణ సంఘం అధ్యక్షుడు ప్రియతమ రామకృష్ణ మాట్లాడుతూ గతంలో కూడా మంచు కుటుంబము ఇలానే బ్రాహ్మణులను కించపరిచే విధంగా సినిమా చేపట్టి పాపం మూటకట్టుకున్నారని , దాని కారణంగానే వారి కుటుంబ కుక్క చింపిన విస్తరాకు లాగా మారిందని ఇప్పటికి మంచు కుటుంబానికి బుద్ధి రాలేదని వ్యాఖ్యానించారు. కన్నప్ప సినిమాలోని కొన్ని సన్నివేశాలు బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఉన్నాయని , ప్రభుత్వం తక్షణమే ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని లేనియడల రానున్న రోజుల్లో బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

Related Posts