YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రోజాకు వార్నింగ్ బెల్స్

రోజాకు వార్నింగ్ బెల్స్

తిరుపతి, జూన్ 16, 
మాజీ మంత్రి ఆర్కే రోజా మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. నగరిలోనే కాకుండా ఆమె కూటమి ప్రభుత్వంపై పెద్దయెత్తున విమర్శలు చేస్తున్నారు. దీంతో ఆర్కే రోజాపై ఇప్పటికే నమోదయిన కేసులను పోలీసులు వేగంగా పరిశీలిస్తున్నారని సమాచారం. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఆర్కే రోజా నగరి నియోజకవర్గంలో రెండు సార్లు విజయం సాధించారు. మూడోసారి మాత్రం 2024 ఎన్నికల్లో గాలి భాను ప్రకాష్ చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత కొద్ది రోజులు రోజా మౌనంగానే ఉన్నారు. ఈ మధ్య కొన్ని బుల్లి తెర షోలలో కూడా ఆర్కే రోజా పాల్గొంటున్నారు. ఇదే సమయంలో వైసీపీకి వాయిస్ గా మారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ లపై విమర్శలు చేస్తున్నారు. దీంతో ఆర్కే రోజా టీడీపీ హిట్ లిస్ట్ లో చేరిపోయారంటున్నారు. రోజా చేస్తున్న వ్యాఖ్యల పట్ల కూటమి సర్కార్ సీరియస్ గానే ఉందని తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఆర్కే రోజాపై నమోదయిన కేసులను పరిశీలించాలని పోలీసులకు ఆదేశాలు పాలకుల నుంచి వెళ్లినట్లు తెలిసింది. మహిళ అయినంత మాత్రాన అవినీతి చేస్తే ఊరుకోవద్దని, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు వెళ్లడంతో ప్రస్తుతం ఆర్కే రోజా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్లు తెలిసింది. అందిన సమాచారం మేరకు ఆమెపై నమోదయిన కేసులను పరిశీలించి నోటీసులు ఇచ్చి విచారణకు కూడా పిలిచేందుకు పోలీసు అధికారులు సిద్ధమవుతున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఆర్కే రోజా వైసీపీ అధికారంలో ఉన్నప్పడు తొలి రెండున్నరేళ్లు ఏపీఐఐసీ కార్పొరేషన్ ఛైర్మన్ గా పనిచేసి తర్వాత టూరిజం, క్రీడల శాఖ మంత్రిగా పదవి బాద్యతలను చేపట్టారు. కార్పొరేషన్ ఛైర్మన్ గా ఆమె తీసుకున్న నిర్ణయాలు వివాదాలుగా ఉన్నాయని చెబుతున్నారు. అదే సమయంలో మంత్రిగా ఉన్న సమయంలో ఆడుదాం ఆంధ్ర పేరిట వైసీపీ ప్రభుత్వ హయంలో రాష్ట్రమంతటా క్రీడా సంబరాలను నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భారీగా నిధులు దుర్వినియోగం అయ్యాయని టీడీపీ నేతలు ఆరోపించారు. ఆడుదాం ఆంధ్రపేరిట వంద కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని టీడీపీ నేతుల సీఐడీ అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే పాత్యా సంఘం, కబడ్డీ అసోసియేషన్ లు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై సీఐడీకి ఫిర్యాదు చేశాయి. వంద కోట్ల రూపాయల స్కాం జరిగిందని వారు ఆరోపించారు. ఆర్కే రోజా పై కేవలం ఇదే కాకుండా తిరుమలలో దర్శనం టిక్కెట్ల విషయంపై కూడా ఫిర్యాదులు చేసే అవకాశాలున్నాయి. ఆడుదాం ఆంధ్ర కేసులో బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి పేరు కూడా వినపడింది. పెద్దయెత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో సీఐడీ అధికారులు ఫైలు దుమ్ము దులుపుతున్నారని తెలిసింది. రెచ్చిపోతున్న రోజాను అడ్డుకట్ట వేయడానికి కేసు నమోదు చేసి విచారించడం మినహా మరొక మార్గం లేదని భావించి ఆ దిశగా చర్యలకు దిగుతున్నట్లు తెలిసింది. మరి ఆర్కే రోజా కేసులను తట్టుకుని ఎలా బయటపడతారన్నది చూడాల్సిందే.

Related Posts