
విశాఖపట్టణం, జూన్ 16,
మోదీ విశాఖకు రానున్నారు. జూన్ 21వ తేదీన జరిగే యోగా వేడుకల్లో పాల్గొనేందుకు ఈనెల 20న విశాఖకు చేరుకుంటారు. ఆ రోజు విశాఖలోనే బస చేస్తారు. మరునాడు ఆర్కే బీచ్‌లో నిర్వహించే యోగా కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఢిల్లీకి తిరుగు పయనమవుతారుప్రధానమంత్రి మోదీ విశాఖలో పర్యటించనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా… జూన్ 21న యోగా కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఇందుకోసం జూన్ 20వ తేదీన విశాఖకు చేరుకోనున్నారు.జూన్ 20వ తేదీన భువనేశ్వర్ నుంచి విశాఖ చేరుకోనున్న ప్రధాని మోదీ… ఆ రోజు రాత్రి తూర్పు నౌకాదళ అతిథిగృహంలో బస చేయనున్నారు. మరునాడు ఉదయం 6.30 నుంచి 7.45 వరకు విశాఖలోని ఆర్కే బీచ్ లో జరిగే యోగా డేలో పాల్గొననున్నారు. రాష్ట్ర సీఎం చంద్రబాబు కూడా ఈ ఈవెంట్ లో భాగమవుతారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోదీ తిరిగి ఢిల్లీకి వెళ్తారు.జూన్ 21 ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజును భారీ స్థాయిలో యోగా కార్యక్రమాలను చేపట్టనుంది. ఒక్క విశాఖలోనే ఒకే రోజు 5 లక్షల మంది యోగా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్కే బీచ్ లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు పాల్గొంటారు.మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మంది లక్ష కేంద్రాల్లో యోగా సాధన చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఉంది. 25 లక్షల మందికి యోగా సర్టిఫికెట్లు అందజేయాలని భావిస్తోంది. ఇదే విషయాన్ని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. లక్ష కేంద్రాల్లో యోగా సాధన చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా యోగా అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నారు. విశాఖపట్నంలోని ఆర్‌కె బీచ్ నుండి భీమిలి బీచ్ వరకు జరిగే యోగా ప్రదర్శనలో భారీ ఎత్తున ప్రజలు భాగస్వాములవుతారని అధికారులు భావిస్తున్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగమయ్యేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. yogandhra.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగా ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ఒకేసారి 5 లక్షల మంది యోగా చేయడానికి వీలుగాా వేదికను సిద్ధం చేస్తున్నారు. ఉదయం 6:30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అనేక ప్రముఖ యోగా గురువులు, యోగా అభ్యాసకులు వస్తారు. దీనితో పాటు 1000 యోగా పార్కులు నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. యోగా దినోత్సవం సందర్భంగా 45 నిమిషాల ప్రోటోకాల్‌లో దాదాపు 20 ఆసనాలు ప్రధానమంత్రి చేస్తారు. ఇవి మొదటిసారి యోగా చేసేవారు కూడా సులభంగా చేయగలిగే ఆసనాలుఈ కార్యక్రమంపై కేంద్ర మంత్రి ప్రతాప్ రావు జాధవ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈసారి యోగా దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన అన్నారు. ప్రధాన కార్యక్రమం ఈసారి విశాఖపట్నంలో జరుగుతుంది. 5 లక్షల మందికిపైగా పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అనేక దేశాల ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.