YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తోతాపురి మామిడి పంచాయితీ...

తోతాపురి మామిడి పంచాయితీ...

తిరుపతి, జూన్ 16, 
తోతాపురి '  మామిడి పండు.. 'S' షేపులో ఆకర్షణీయం గా ఉండే  ఈ రకం మామిడిని "కలెక్టర్ మామిడి " అని ఆంధ్రా ప్రాతంలో పిలుస్తారు. నార్త్‌లో బాగా ఫేమస్ అయిన ఈ పండు ఏపీలో రాయలసీమలో ముఖ్యంగా చిత్తూరులో ఎక్కువగా సాగులో ఉంది. ఆంధ్రా ప్రాంతంలో దీన్ని పెద్దగా తినరు. అక్కడ ఎక్కువగా బంగినపల్లి, రసాలు, పంచదార కల్తీ, పండూరు రకాలకు డిమాండ్. అయితే "కలెక్టర్ కాయ' రకం మామిడిని మ్యాంగో పల్ప్ (గుజ్జు ) తయారు చేయడంలో ఎక్కువగా వాడతారు. ఎక్కువకాలం నిలువ ఉండడంతపాటు గుజ్జు ఎక్కువగా ఉండడంతో 'తోతాపురి "ని ప్రాసెస్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ "తోతాపురి" మామిడి ఏకంగా మూడు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టింది.  ఆంధ్రా, కర్ణాటకతోపాటు తమిళనాడు మామిడి రైతులు, ప్రాసెసింగ్ వ్యాపారుల మధ్య  ఇది వివాదం రేపింది. చివరకు ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి " తోతాపురి " మామిడి దిగుమతులను అధికారుల నిషేదించడంతో  ఇది  ప్రభుత్వాల స్థాయిలో  వివాదం రేపే స్థాయికి చేరిపోయింది.ఏపీలోని కృష్ణా జిల్లాతో సమానంగా మామిడి సాగులో పోటీ పడేది చిత్తూరు జిల్లా. చిత్తూరు జిల్లాలో మామిడి గుజ్జు తీసి ఎగుమతి చేసే పరిశ్రమలు 47 ఉన్నాయి. వీటిలో చాలా వరకూ 2014-19 మధ్య కాలం లో తెరిచినవే. ఈ సీజన్‌లో వాటిలో 16 పరిశ్రమలను ఓపెన్ చేసి మామిడి గుజ్జు తయారుచేస్తున్నారు. దీనికోసం జిల్లా రైతుల నుంచి మామిడి పళ్ళను సేకరించడం మొదలు పెట్టారు. అయితే రైతులు కేజీ "తోతాపురి' మామిడి పళ్లకి కనీసం 12 రూపాయల మద్దతు ధర డిమాండ్ డిమాండ్ చేయడంతో ప్రభుత్వం వారికి పరిశ్రమలు 8 రూపాయలు ప్రభుత్వం తరపున 4 రూపాయలు కలిపి 12 రూపాయలు అందేలా నిర్ణయం తీసుకుంది. దీనిపై  మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులు అడ్డు చెప్పారు. ఓపెన్ మార్కెట్ లో "తోతా పురి " మామిడి రేటు కేజీ 5 రూపాయల కంటే ఎక్కువ లేదు. అలాంటప్పుడు తాము 8 రూపాయల చొప్పున ఎందుకు ఇవ్వాలనేది వారి అభ్యంతరం. పైపెచ్చు ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో ఉండే "గుడిపాల " మండలం ద్వారా ఏపీలోకి పక్క రాష్ట్రాల రైతులు తమ మామిడిపండ్లను తక్కువ రేటుకే చిత్తూరులోని పరిశ్రమలకు తరలిస్తున్నారు. దీనికి చిత్తూరు జిల్లా మామిడి రైతులు అడ్డు చెప్పడంతో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమీత్ కుమార్ జిల్లా లోని పరిశ్రమ లు వేరే రాష్ట్రాల నుంచి మామిడి కొనకుండా పరిశ్రమలను ఆదేశించారు. పైగా షిఫ్టింగ్ పద్దతిలో పరిశ్రమల వద్ద ఉద్యోగులకు డ్యూటీ లు వేసి మామిడి పళ్ళని అమ్మడానికి వచ్చే రైతుల ఆధార్ కార్డులు, పాస్ బుక్ జిరాక్స్ లు, ఈ క్రాప్ బుకింగ్ వివరాలు, రాయితీ నమోదు వివరాలు చెక్ చేస్తున్నారు. స్థానిక రైతుల మంచి కోసమే ఈ ఆంక్షలు తెచ్చినట్టు అధికారులు చెబుతున్నారు.అయితే ఈ పరిణామంపై పక్క రాష్ట్రాలైన తమిళనాడు కర్ణాటక అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య  ఈ నిర్ణయంపై మరోసారి ఆలోచించాలని ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఇతర జిల్లాల్లో లేని ఆంక్షలు ఒక్క చిత్తూరులోని ఎందుకు అని  ఆయన లేఖలో అడిగారు. ఇక కర్ణాటక చీఫ్ సెక్రటరీ శాలిని రాజనీష్ కూడా ఏపీ చీఫ్ సెక్రటరీకి లేఖ రాస్తూ నిర్ణయం " చిరకాల సెంటిమెంట్" లను దెబ్బతీసేలా ఉందని పేర్కొన్నట్టు తెలుస్తోంది. కోలార్ లోని మూడు గుజ్జు పరిశ్రమలు, తుముకూరు దగ్గర మరో పరిశ్రమ తెరవని కారణం వల్లనే వారు చిత్తూరు జిల్లాలోని గుజ్జు పరిశ్రమలకు తమ మామిడిపళ్ళను పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో అలా పక్క రాష్ట్రం నుంచి వచ్చే మామిడిపండ్లపై  బ్యాన్ విధించడం తో అక్కడ వివాదం రాజుకుంది. ఏషియాలోనే అతిపెద్ద టమాట మార్కెట్ లు తమిళనాడులోని కోయంబేడు, చిత్తూరులోని మదనపల్లి, కర్ణాటకలోని కోలార్ లలో ఉన్నాయి. ఇప్పుడు ఇలా పక్క రాష్ట్రం నుంచి వచ్చే మామిడి పళ్ళపై చిత్తూరు జిల్లాలో బ్యాన్ విధిస్తే రేపు దీని ప్రభావం జిల్లాలోని టమాట రైతులపై  పడే ప్రభావం ఉందని వ్యాపారులు గుర్తు చేస్తున్నారు. మరి ఈ వివాదం రానున్న రోజుల్లో మరెన్ని పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.

Related Posts