YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఓల్డ్ సిటీలో ఏం జరుగుతోంది...

ఓల్డ్ సిటీలో ఏం జరుగుతోంది...

హైదరాబాద్, జూన్ 16,
తెలంగాణలో హైదరాబాద్ అంటే విభిన్న మతాలు, సంస్కృతులు, జాతులు, కులాల కలయిక. గతంలో పాతబస్తీలో మతాల మధ్య ఘర్షణలు పీక్స్ లో ఉండేవి. ఒకరిపై ఒకరు దాడులు, ప్రతి దాడులతో ఉద్రక్త వాతావరణం నెలకొనేది. కానీ తరువాత కాలంలో ఆ పరిస్థితుల్లో క్రమంగా మార్పులు రావడం, మరీ ముఖ్యంగా మతం పేరుతో రెచ్చిగొట్టడం, హత్యలు, అత్యాచారలు చేయడం తగ్గడంతోపాటు రాజకీయ పార్టీలకు కూడా ఆ తరహా స్టఫ్ కూడా అంతగా దొరికేది కాదు. కానీ ప్రస్తుతం పాతబస్తీ చుట్టుప్రక్కల పరిస్థితులు చూస్తుంటే తిరిగి నిత్యం  ఘర్షణల బాద్ గా హైదరాబాద్ ఓల్డ్ సిటీని మార్చేస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.మతం అత్యంత సున్నితమైన అంశం. ఓ మతం మనోభావాలు దెబ్బతినేలా, మరో మతానికి చెందిన వారు వ్యవహరించకూడదు. అలా వ్యవహరిస్తే చట్టంతో కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. కానీ పాతబస్తీలో తాజా పరిణామాలు చూస్తుంటే, విమర్శించే నోళ్లు , ఫిర్యాదులు చేసే చేతులు లైట్ తీసుకుందాం అనేలా రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహిరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల బక్రీద్ సందర్భంగా గోవధ భారీగా జరుగుతోందని, పాలిచ్చే ఆవులను సైతం దారుణంగా బలిచ్చేస్తున్నారంటూ విహెచ్‌పీ, హిందూ సంఘాలు లబోదిబోమన్నాయి. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం బైక్ పై వెళుతూ చూడండి ఈ గోవధ దారుణం అంటూ వీడియో విడుదల చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని అభ్యర్దించారు. కానీ జరగాల్సిన తంతులలో ఏ మార్పులేదు. గోవధను అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమైయ్యిందనే విమర్శలు కూడగట్టుకుంది. హిందువులపై మరో మతస్తులు రాళ్లు రువ్వుతుంటే పోలీసులు చర్యలు తీసుకోలేదనే బిజెపి ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్నిరోజులు హిందువులపై దాడులు జరుగుతూనే ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇంతేనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలా గోవధను తాకిన రాజకీయాలు మతం ఫ్లకార్డులను తగిలించి, మత రాజకీయాలను పీక్స్‌కు తీసుకెళ్తున్నాయి. తాజాగా మలక్ పేట్ ఘటన సైతం అగ్నికి ఆజ్యం పోసేలా మతాల మధ్య చిచ్చును పెట్టే మరో ఆయుధంగా మారింది. మలక్ పేట్, అస్మాన్ ఘాట్ లోని ఎలైట్ అపార్ట్మెంట్ లో నివసిస్తున్న బ్రహ్మనందం అనే వ్యక్తిపై కొందరు మైనార్టీ యువకులు దాడి చేశారు. బిల్డర్ మనుషులుగా చెప్పుకుంటూ విచక్షణా రహితంగా కొట్టారు. అడ్డుకోబోయిన మహిళలతో సైతం దురుసుగా ప్రవర్తించారు. సెల్లార్ లో అక్రమ నిర్మాణం అడ్డుకున్నందుకే ఓ హిందువును దారుణంగా కొట్టారని తెలయడంతో బిజెపి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి స్పాట్ కు వెళ్లారు. కలిసుందామా.. కలిసుందాం.. లేదా చంపుకుందామా.. చంపుకుందాం.. అంటూ తీవ్రస్దాయిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మైనార్టీలను ఉద్దేశించి రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి.  ఎమ్మెల్యే మాటలు మత సామరస్యం దెబ్బతినేలా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తినా, డోన్ట్ కేర్ అంటూ హిందువుల గొంతుగా బిజెపి నేతలు మాటల తూటాలు విసురుతున్నారు. ఇదే ఘటనపై తాజాగా బిజెపి నాయకురాలు మాధవిలత మరో అడుగు ముందుకేసి ఏకంగా గొడవ జరిగిన అపార్ట్మెంట్ ముందు గణపతి విగ్రహంతో చిన్న గుడి కట్టేశారు. ఇప్పడు ఈ గుడి కూల్చండి చూద్దామంటూ సవాలు విసిరారు. హిందువులపై దాడులు చేస్తే ఖబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు.ఇలా ఇటీవల కాలంలో రాష్ట్ర బిజెపిలో కీలక నేతలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ దాడులపై మాత్రం ఎంఐఎం  నేతలు ఎక్కడా నోరు విప్పడంలేదు. మరోవైపు బిఆర్ఎస్ కూడా మౌనమే నా భాష ఓ మూగ మనసా అంటూ చూస్తూ పోతోంది. పరిస్థితి చేయదాటక ముందే అదుపు చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మతం ముసుగులో దాడులు చేస్తే  అది ఎవరైనా, చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామనే సంకేతాలు ఇచ్చిన ధాఖలాలు లేవనే అపవాదు మూటగట్టుకుంటోంది రేవంత్ సర్కార్. ఇదే అవకాశంగా తగ్గేదే లేదంటూ బిజెపి నేతలు హిందు పాలిటిక్స్‌తో ముందుకెళ్తున్నారు. ఈ మత చిచ్చు రాజకీయాలు చేస్తున్నది ఎవరు, ఎవరు అలా చేసినా ప్రభుత్వం చర్యలు తీసుకుని.. ఇక్కడితో ఆపకపోతే సామాన్య జనం బలవ్వాల్సిన పరిస్థితి వస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Related Posts