YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీకి కోవర్టుగా వాసుపల్లి

టీడీపీకి కోవర్టుగా వాసుపల్లి

విశాఖపట్టణం, జూన్ 17,
మాజీ ఎమ్మెల్యే కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయా? ఆయన మాటలు ఇప్పుడే ఎందుకు తేడాగా వినిపిస్తున్నాయి? మామీద మీ పెత్తనం ఏంటి? ఎక్కువ చేస్తే… పార్టీ ఆఫీస్‌ మెట్లు కూడా ఎక్కబోమని ఎందుకు అంటున్నారు? చచ్చేదాకా వైసీపీలోనే ఉంటానని ఒకవైపు చెబుతూనే… మరోవైపు స్వరం మారుస్తున్న ఆ మాజీ ఎవరు? ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఉత్తరాంధ్ర వైసీపీలో ఒక్కొక్కటిగా అసమ్మతి స్వరాలు పెరుగుతున్నాయా అంటే… అవును, అలాగే కనిపిస్తోందంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌. అందుకు తాజా ఉదాహరణగా… విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్‌ని చూపిస్తున్నారు. అంతకు ముందు సంగతి ఎలా ఉన్నా…. ఇటీవల వెన్నుపోటు దినం పోస్టర్ ఆవిష్కరణ వేదికగా ఆయన అన్న మాటలు, లేవనెత్తిన ప్రశ్నలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఉత్తరాంధ్ర కో ఆర్డినేటర్‌ వ్యవస్థ పార్టీ అధినేతకు, తమకు మధ్య అడ్డుగోడగా మారిందన్న మాటల చుట్టూ రకరకాల విశ్లేషణలు పెరుగుతున్నాయి. గతంలో ఆ పోస్ట్‌లో ఉన్న విజయసాయిరెడ్డి చర్యలవల్ల ఒక్కో నియోజకవర్గంలో కనీసం 10వేల ఓట్లు కోల్పోయామన్న రాజకీయ సూత్రీకరణను తెరపైకి తెచ్చారు వాసుపల్లి. అలాంటి వ్యవస్థ ఇప్పటికీ అవసరమా…? అన్న అభిప్రాయంతో…. ప్రస్తుత కో ఆర్డినేటర్ కన్నబాబును కోట్ చేస్తూ… మాట్లాడ్డాన్ని కాస్త తేడాగానే చూస్తున్నాయట వైసీపీ వర్గాలు. ఇప్పుడు కూడా పాత పద్ధతులనే కొనసాగిస్తామని చెబితే… పార్టీ ఆఫీసులోకి కూడా అడుగు పెట్టబోనంటూ…. తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు మాజీ ఎమ్మెల్యే. దీంతో వాసుపల్లి ఆలోచన ధోరణి వైసీపీ లో విస్తృత చర్చ జరుగుతోందట. ఓవైపు కూటమి ప్రభుత్వం ఏడాది వైఫల్యాలపై పోరాటానికి సమాయత్తం అవుతున్న టైంలో…. వాసుపల్లి లాంటి వాళ్ళు పాత చేదు జ్ఞాపకాలతోనే సహవాసం చేయడం ఏంటని మాట్లాడుకుంటున్నాయట పార్టీ వర్గాలు. ఇక్కడ టీడీపీతో పోలిక తీసుకురావడం మరింత ఇబ్బంది మారిందట వైసీపీ నాయకత్వానికి. వాసుపల్లి గణేష్‌ రాజకీయంగా ఎదిగింది, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచింది టీడీపీలోనే. 2014, 2019లో విశాఖ దక్షిణ స్థానం నుంచి గెలిచారాయన. ఆ సమయంలో నేరుగా చంద్రబాబుతో మాట్లాడే అవకాశం ఉండేదని…కానీ… వైసీపీ అధికారంలో ఉన్నా…ప్రతిపక్షం లో కూర్చున్నా…. నియోజకవర్గ సమస్యల గురించి పార్టీ అధ్యక్షుడు జగన్‌కు నేరుగా రిపోర్ట్ చేసే అవకాశం లేకుండా పోయిందని, అదే అతిపెద్ద సమస్య అంటున్నారట ఈ మాజీ.వాస్తవానికి 2024 ఎన్నికల ఫలితాలు మిగిలిన నియోజకర్గాలతో పోలిస్తే వాసుపల్లికి అతిపెద్ద షాక్. జనసేన పోటీ చేయడం, ప్రత్యర్ధి వంశీకృష్ణ పొరుగు నియోజకవర్గం నుంచి రావడం, రెండు సార్లు గెలిచిన తన అనుభవం అన్నీ కలిసొచ్చి స్వల్ప మెజారిటీతో అయినా.. బయటపడతానని అనుకున్నారట ఆయనకానీ… ఆ అంచనాలను తల్లకిందులు చేస్తూ… ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ 64వేలకు పైగా మెజార్టీతో గెలవడం చూసి వాసుపల్లి నిజంగానే షాకయ్యారన్నది లోకల్‌ వాయిస్‌. ఆ తర్వాతనే ఆయన పార్టీలోని అత్యంత కీలకమైన వ్యవస్థని టార్గెట్‌ చేస్తూ మాట్లాడటం యాధృచ్చికం కాకపోవచ్చని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. 2019లో టీడీపీ నుంచి గెలిచి ఏడాది కాలానికే జెండా పీకేశారు ఈ మత్స్యకార నేత. వైసీపీ అధినాయకత్వం సాదరంగా స్వాగతించినప్పటికీ నియోజకవర్గ రాజకీయాలు కంట్లో నలుసుగా మారాయట. అప్పటి వైసీపీ నేత, బ్రాహ్మణ కార్పొరే షన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ వర్సెస్ వాసుపల్లిగా వ్యవహారం నడిచేది. అప్పటి పార్టీ ముఖ్యనేత విజయ సాయిరెడ్డి ప్రమేయంతోనే తాను ఇబ్బంది పడాల్సి వచ్చిందన్న అభిప్రాయం ఆయనలో ఉందట. ఇక ఎన్నికలకు ముందు సుధాకర్ పార్టీ మారిపోయి దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ అయ్యారు. ఇక దక్షిణ నియోజకవర్గం వైసీపీలో తనకు ఇబ్బంది లేదనుకుంటున్న టైంలో చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఇప్పుడు ఆయన స్వరం ఎందుకు మారిందన్న చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో అధికారం మారిన వెంటనే ఆయన తిరిగి కూటమికి దగ్గరవుతారని అనుకున్నారు అంతా. గణేష్ కుమార్ మాత్రం ప్రాణం వున్నంత వరకు వైసీపీలోనేనని తేల్చేశారు. అలాంటప్పుడు ఈ అసంతృప్త స్వరం ఎందుకంటే… అందుకు వేరే బలమైన కారణాలున్నాయన్న విశ్లేషణలు నడుస్తున్నాయి. విశాఖ దక్షిణంలో బలపడేందుకు మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కుటుంబం ప్రయత్నం చేస్తోందట. అలాగే… ఒకరిద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా యాక్టివేట్ అవుతున్నట్టు సమాచారం. వాళ్ళకు పార్టీలోని సీనియర్లు సహకరిస్తున్నారన్న అనుమానమే ఆయన అసహనానికి కారణం కావచ్చంటున్నారు. అందుకే కో ఆర్డినేటర్‌ వ్యవస్థను కూడా ప్రశ్నిస్తుండవచ్చన్నది ఓ వాదన. మొత్తం మీద వైసీపీలోని అత్యంత కీలకమైన వ్యవస్థ టార్గెట్‌గా వాసుపల్లి సంధించిన అసంతృప్తి అస్త్రం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Related Posts