YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏడాది సంబురాల్లో కనిపించని కమలం

ఏడాది సంబురాల్లో కనిపించని కమలం

విజయవాడ, జూన్ 17, 
రాష్ట్రంలో కూట‌మి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయింది. ఈ ఏడాది కాలంలో జరిగిన పాలనపై రాష్ట్ర ప్రభుత్వం సంబరాలకు సిద్ధమైంది. ప్రధానంగా ప్రజలను కలుసుకోవడం ప్రజల సంతృప్తిని లెక్క వేసుకోవడం వారికి అనుకూలంగా మళ్లీ కార్యక్రమాలు నిర్వహించడం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. అయితే కూటమి పార్టీలుగా విజయం దక్కించుకున్న వాటిలో బీజేపీ కీలకమైంది. కేంద్రంలో ఈరోజు మోడీ ప్రభుత్వం ఏర్పడడానికి రాష్ట్రంలో ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం అత్యంత ముఖ్యమైనది. ఇది అందరికీ తెలిసిందే.ఇలాంటి సమయంలో కేంద్రంలో కూటమి ప్రభుత్వాన్ని బలపరుస్తున్న చంద్రబాబుకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని బలపరచాలన్నటువంటి ఆలోచన బిజెపికి రాకపోవడం చాలా శోచనీయం. ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఏడాదిపాలనపై కార్యక్రమాలను నిర్వహిస్తున్నా.. బిజెపి నాయకులు ఎక్కడా కనిపించడం లేదు. ముఖ్యంగా తల్లికి వందనం వంటి పథకాన్ని అమలు చేసినప్పుడు కూడా దీనిపై ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించలేదు. దీనివ‌ల్ల‌ అనేకమంది మహిళలకు లబ్ధి జరుగుతోందని ఒక ప్రెస్ మీట్ గాని ఒక ప్రకటన గాని విడుదల చేయలేదు.అలాగే పింఛన్ల పెంపు, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి వాటిపై కూటమీ పాలకులు ఒకవైపు ప్రకటనలు చేస్తున్న బిజెపి పక్షాన ఎవరు నోరు ఎత్తటం లేదు. మరి దీన్ని ఎలా చూడాలి? ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే రేపు ఏదైనా ప్రజల్లో అసంతృప్తి రగిలి అసంతృప్తి కారణంగా విమర్శలు చేస్తే మా తప్పులేదు అని తప్పించుకునే దారి బిజెపిలో కనిపిస్తోందా? లేకపోతే రేపు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తే దానికి మాకు సంబంధం లేదు మేము నిమిత్త మాత్రులం అని తప్పించుకునే దారి కనిపిస్తోందా అంటే అవునని అంటున్నారు పరిశీలకులు.కూటమి ప్రభుత్వంలో ఏం చేసినా అది మూడు పార్టీలకు వర్తిస్తుంది. రేపు ఓట్లు అడిగే విధానాన్ని పరిశీలిస్తే మూడు పార్టీల పరంగానే ప్రజల్లోకి వెళ్లాలి. మూడు పార్టీల పరంగానే ప్రజలను ఓట్లు అభ్యర్థించాలి. ఈ విషయంలో బిజెపి నాయకులు అనుసరిస్తున్న ధోరణి ప్రధానంగా చర్చగా మారింది. ఇది సరికాదని ప్రజల్లోకి రావాలనేది కూట‌మి పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు సూచిస్తున్నారు. నిజానికి గత ఎన్నికల్లో విజయం ఎలా ఉన్నా వచ్చే ఎన్నికల నాటికి ఈ ఐదేళ్ల పాలనను చూసి మాత్రమే ప్రజలు ఓటేస్తారు తప్ప జగన్ పై విమర్శలు చేయ‌డం ద్వారా ఓట్లు ఎంతవరకు పడతాయి అనేది చూడాలి.కాబట్టి మళ్ళీ ఎన్నికల్లో విజయం దక్కించుకోవాలన్నా.. మళ్లీ ఎన్నికల్లో మెజారిటీ ఓట్లు సాధించాలన్నా కూడా అందరూ కలిసికట్టుగా సంయుక్తంగా ప్రజల మధ్య ఉండడం ప్రజల సమస్యలు పట్టించుకోవడం ముఖ్యం. సంతృప్తిని కూడా అంచనా వేసుకోవడం వంటివి బిజెపి నాయకులు కూడా చేయాల్సిన అవసరం ఉందనేది పరిశీలకులు చెబుతున్న మాట. మ‌రి క‌మ‌ల నాథులు ఏమంటారో చూడాలి.

Related Posts