YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కర్నూలులో వారసులొస్తున్నారు...

కర్నూలులో వారసులొస్తున్నారు...

వార‌సుల‌తో టీడీపీ క‌ళ‌క‌ళ‌లాడుతోంది. ఈసారి త‌మ‌తో పాటు త‌మ వార‌సుల‌ను రంగంలోకి దించేందుకు సీనియ‌ర్లు వేగంగా పావులు క‌దుపుతున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వారసుల ప్రభావం ఎలా ఉండబోతున్నద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.టీడీపీనే గాక ఇత‌ర పార్టీల నుంచి ఈసారి యువ‌కులు రంగంలోకి దిగ‌బోతున్నారు. ఒక్కో జిల్లా నుంచి ఇద్ద‌రు.. మ‌హా అయితే ముగ్గురి పేర్లు వినిపించినా.. ఒక జిల్లా నుంచి మాత్రం ఏకంగా అర‌డ‌జ‌ను మంది పేర్లు వినిపిస్తున్నాయి. వినిపించ‌డ‌మే కాదు.. వీరంతా త‌మ‌దైన శైలిలో ఆ జిల్లా రాజ‌కీయాల్లో దూసుకు పోతున్నారు. కర్నూలు జిల్లా రాజకీయం యువ నాయకత్వంతో కళకళలాడుతోంది. కర్నూలు జిల్లా రాజకీయాల్లో సీనియర్‌ నేతగా పేరుపొందిన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తనయుడు శ్యామ్‌బాబు. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పేరుపొందిన కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తనయుడు కోట్ల రాఘవేంద్రారెడ్డి. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ కొడుకు టీజీ భరత్‌. వైసీపీలో ఉన్న మాజీమంత్రి శిల్పా మోహన్‌రెడ్డి కుమారుడు శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి. ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి కుమారుడు విజయేంద్రనాథ్‌రెడ్డి. నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తమ్ముడి కొడుకు బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి పేర్లు జిల్లాలో బ‌లంగా వినిపిస్తున్నాయి.నాయ‌కుల వెన్నంటే తిరుగుతూనే త‌మ బ‌లాన్ని, బ‌ల‌గాన్ని పెంచుకుంటున్నారు. స‌హ‌జ‌మైన దూకుడు స్వ‌భావంతో ప్ర‌జ‌ల్లోకి చొచ్చుకెళుతూ.. ప్ర‌త్య‌ర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు.కేఈ శ్యామ్‌బాబు పత్తికొండ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. 2019 ఎన్నికల్లో శ్యామ్‌బాబు తెలుగుదేశం తరఫున పోటీచేస్తాడ‌ని కేఈ గతంలో ప్ర‌క‌టించారు. అప్పటినుంచి శ్యామ్‌బాబు పార్టీ కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలో పత్తికొండ వైసీపీ ఇన్‌ఛార్జ్‌ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యకు గుర‌వ‌డం, ఈ కేసులో శ్యామ్‌బాబుపై కేసు నమోదయ్యింది. దీంతో అతని దూకుడుకి కొద్దికాలం బ్రేక్ పడింది. నవనిర్మాణ దీక్షలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పత్తికొండ పర్యటనకు వచ్చారు. ఆ సందర్భంగా శ్యామ్‌బాబు గ్రాఫ్ మరింత పెరిగింది.ఇక పత్తికొండలో కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తెరపైకి వచ్చారు. 2019లో కాంగ్రెస్ త‌ర‌ఫున ప‌త్తికొండ నుంచి నా కొడుకు రాఘ‌వేంద్రారెడ్డి బ‌రిలోకి దిగుతాడ‌ని ప్రకటించారు. దీంతో పత్తికొండలో చురుకుదనం పెంచిన రాఘవేంద్రారెడ్డి ఆ తర్వాత కొంత జోరు తగ్గించారు. ఇక్క‌డ ఇద్ద‌రు ప్ర‌ధాన కుటుంబాల‌కు చెందిన వార‌సుల పోటీతో రాజ‌కీయం ర‌స‌కందాయంలో ప‌డింది. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ తనయుడు టీజీ భరత్ కూడా తన సత్తా చాటుతున్నారు. ఓవైపు టీజీబీ ట్రస్ట్ సేవా కార్యక్రమాల్లో, మరోవైపు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ తనకే ఖాయమని భావిస్తూ కార్యక్రమాలు చేసుకుపోతున్నారు. ప్రతిపక్ష నాయకుల కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతున్నారు. అందుకనుగుణంగా వ్యూహాలు రచిస్తూ ముందుకెళుతున్నారు. క‌ర్నూలు టీడీపీ టిక్కెట్ కోసం భ‌ర‌త్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ.మోహ‌న్‌రెడ్డితో సై అంటే సై అంటున్నారు.ఇక నంద్యాల వైసీపీ నేత, మాజీమంత్రి శిల్పా మోహన్ రెడ్డి తనయుడు రవిచంద్ర కిశోర్‌రెడ్డి, ఇటు ఆళ్లగడ్డ వైసీపీ నేత, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి కుమారుడు విజయేంద్ర నాథ్‌రెడ్డి తమ తండ్రుల అనుభవాలనే పాఠాలుగా చేసుకుని రాజకీయాల్లో రాణిస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికల తర్వాత శిల్పా వర్గాన్నంతా ర‌విచంద్ర‌ ఒక తాటిపైకి తీసుకొచ్చారు. మరోవైపు శిల్పా ట్రస్ట్ ద్వారా సేవా కార్య క్ర మాలను కూడా విస్తృతంగా చేపడుతున్నారు. 2019 ఎన్నికల్లో తనకే టిక్కెట్ ఇస్తాడన్న ఆశాభావంతో ఉన్నట్లుగా సమాచారం.ఇక ఆళ్లగడ్డ నేత గంగుల ప్రభాకర్‌రెడ్డి తనయుడు విజయేంద్రనాథ్‌రెడ్డి గత నాలుగేళ్లుగా ఆళ్లగడ్డ రాజకీయాల్లో కలియదిరుగుతున్నారు. మంత్రి భూమా అఖిలప్రియ వర్గం బలమైనదైనప్పటికీ, 2019 ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ సంపాదించి, గెలుపే లక్ష్యంగా దూసుకుపోవాలని బిజేంద్రనాథ్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తమ్ముడి కుమారుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కూడా 2014 ఎన్నికల ముందు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. సాయి ఈశ్వరుడి హత్య కేసులో సిద్ధార్థరెడ్డి ముద్దాయిగా ఉండటంతో కొంతకాలం పాటు ప్రత్యక్ష రాజకీ యాలకు దూరమయ్యారు. టీడీపీలోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించినా ఫలించకపోవడంతో ఒంటరిగానే నందికొ ట్కూరు రాజకీయాల్లో ముందుకు సాగుతున్నారు. అనేక సవాళ్ల మధ్య ఈ ఆరుగురు యువ నాయకులు రాజకీయ వారసులుగా ఆరంగ్రేటం చేసి తమ సత్తా చాటుతున్నారు.

Related Posts