
హైదరాబాద్, జూన్ 18,
పట్టాలపై పరిగెత్తడానికి కొత్తగా 200 రైళ్లు తయారవుతున్నట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. వీటిలో చాలావరకు తెలంగాణలోనే తయారవుతుడం విశేషం. వీటిలో అధునాతన ట్రైన్స్ ఉన్నాయి. ఇటీవలే రైల్వే ట్రాక్లు మార్చడంతో పాటు వాటి స్పీడ్ లిమిట్ కూడా పెంచడంతో దానికి తగ్గట్టుగా మోడ్రన్ రైళ్లను అందుబాటులోకి తెస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను రైల్వే మంత్రి తన సోషల్ మీడియా హ్యాండిల్ లో పోస్ట్ చేసారు. లేటెస్ట్ గా తయారైన రైళ్లలో 50 నమో భారత్ ట్రైన్స్ ఉన్నాయి. ఇవి పూర్తిగా ఏసీతో ఉండే ప్యాసింజర్ ట్రైన్స్. ప్రయోగాత్మకంగా గుజరాత్‌లో అహ్మదాబాద్ నుంచి భుజ్, బిహార్‌లో పాట్నా నుంచి జయ్‌నగర్ వరకూ నడిపారు. వీటికి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో మరో 50 నమో భారత్ ఏసీ రైళ్లను దేశవ్యాప్తంగా నడపడానికి రెడీ చేసారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దగ్గర దూరాలకు వెళ్లే ప్యాసింజర్ రైళ్ళ కొరత విపరీతంగా ఉంది. దాన్ని అధిగమించడం కోసం రైల్వే శాఖ 100 MEMU రైళ్లను రెడీ చేసింది. ఇవన్నీ తెలంగాణలోని కాజీపేట రైల్వే ఫ్యాక్టరీలో తయారయ్యాయి. సాధారణంగా మెమూ రైళ్లకు 8-12 బోగీలు ఉంటాయి. కానీ కొత్తగా ప్రవేశపడుతున్న MEMU లకు 16-20 బోగీలు ఉండనున్నాయి. వీటితో ప్యాసింజర్ రైళ్ళ కొరత చాలా వరకూ తీరనున్నట్టు రైల్వే మంత్రి తెలిపారు సుదూర ప్రాంతాలకు ప్రయాణించే సామాన్యుల కోసం ప్రవేశపెట్టిన నాన్-ఏసీ అమృత్ భారత్ రైళ్లు ప్రస్తుతం మూడు ఉన్నాయి. అవికాక 6రైళ్లు రెడీ అయ్యాయి. ఇప్పుడు మరొక 50 అమృత్ భారత్ ట్రైన్లను తయారు చేస్తున్నట్టు అశ్విని వైష్ణవి ప్రకటించారు. ఈ అమృత్ భారత్ రైళ్ళ లో కేవలం జనరల్, స్లీపర్ క్లాసులు మాత్రమే ఉంయి. ఈ ప్రకటనతో మొత్తం మీద సామాన్యుల కష్టాలను ఇన్నాళ్లకు రైల్వే గుర్తించింది అన్న కామెంట్స్ వినపడుతున్నాయి