
హైదరాబాద్
కూకట్ పల్లి లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఐదున్నర సంవత్సరాల ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ మరియు మాస్టర్స్ ప్రోగ్రామ్ను 2025- 26 విద్యా సంవత్సరానికి గాను జర్మనీకి చెందిన యూనివర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు యూనివర్సిటీ అధికారులు.దీనిలో భాగంగా నాలెడ్జ్ ఫౌండేషన్ రూట్లింగెన్ యూనివర్సిటీ (KFRU), మరియు కాసెల్ యూనివర్సిటీల ప్రతినిధులతో జేఎన్టీయూ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ కిషన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దీనిలో ముఖ్యంగా బీటెక్ మరియు ఎంటెక్ ప్రోగ్రాం లను విద్యార్థులకు ఈ సంవత్సరం నుండి అందుబాటులోకి తీసుకొని వచ్చామని బీటెక్ లో మూడు సంవత్సరాల పాటు జేఎన్టీయూ యూనివర్సిటీలో చదివి అనంతరం రెండున్నర సంవత్సరాలు జర్మనీలో కోర్సులు పూర్తి చేయాల్సి ఉంటుందని, అదేవిధంగా మాస్టర్స్ లో ఒక సెమిస్టర్ జేఎన్టీయూ లో చదివి. సంవత్సరం నర జర్మనీలో చదవాల్సి ఉంటుందని అన్నారు. దీనికిగాను కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని తెలిపారు. దీనికి సంబంధించి జేఈఈ మెయిన్,ఎప్ సెట్ , ఇంటర్ మార్కుల ఆధారంగా విద్యార్థులను తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు విద్య నైపుణ్యం తో పాటు రియల్ టైం ఎక్స్పీరియన్స్ ను అందించే దిశగా ఇండస్ట్రీ ఇంట్రాక్షన్ సైతం ఉండనుందని ఈ సందర్భంగా వెల్లడించారు. జర్మనీలో చదువుకోవాలనుకుంటున్న విద్యార్థులకు ఇదొక మంచి సదవకాశం అని ఆ దేశం కూడా మన విద్యార్థులకు సాధారణంగా స్వాగతం పలుకుతుందని వారు అన్నారు. జాబ్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్స్ తో ఎన్నో రకాల ప్లేస్మెంట్స్ కూడా అవుతున్నాయని అదేవిధంగా విద్యార్థులకు అక్కడే 20 గంటల పాటు ఉద్యోగం చేసుకునే అవకాశం సైతం ఉందని అన్నారు. ఎన్ఐటి ఐఐటీలకు తో ఒప్పందం కుదుర్చుకునే ఇలాంటి యూనివర్సిటీలు రాష్ట్రానికి సంబంధించిన విశ్వవిద్యాలయమైన జేఎన్టీయూ యూనివర్సిటీతో ఎం ఓ యు చేసుకోవడం ఇదే మొట్టమొదటిసారి అని అన్నారు. ఇప్పటికే జేఎన్టీయూ స్వీడన్ దేశంతో సైతం మొట్టమొదటి ఎంపోయు కుదుర్చుకోగా జర్మనీతో ఇది రెండవ ఎం ఓ యు అని విసి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాలెడ్జ్ ఫౌండేషన్ రూట్లింగెన్ యూనివర్సిటీ , మరియు కాసెల్ యూనివర్సిటీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.