YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

లడ్డూ కష్టాలకు ఫుల్ స్టాప్...

లడ్డూ కష్టాలకు ఫుల్ స్టాప్...

తిరుమల, జూన్ 24, 
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. భక్తులకు లడ్డూ కష్టాలు తొలగించేందుకు కియోస్క్ మిషన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దర్శన టికెట్ లేదా ఆధార్ నెంబర్ ను కియోస్క్ మిషన్ లో ఎంటర్ చేసి అక్కడ కనిపించే క్యూఆర్ కోడ్ పై పేమెంట్ చేస్తే రసీదు వస్తుంది. అది తీసుకెళ్లి కౌంటర్ లో అందిస్తే లడ్డూలు పంపిణీ చేస్తారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుని భక్తుల సేవలు మరింత సులభతరం చేసే విధంగా టీటీడీ వినూత్న ఏర్పాట్లు చేసింది. తిరుమలలో లడ్డూ కౌంటర్ల వద్ద కియోస్క్ మెషిన్లు ఏర్పాటు చేసింది. సాధారణంగా లడ్డూ ప్రసాదం కావాలంటే నేరుగా కౌంటర్ వద్దకు వెళ్లి ఆధార్ కార్డ్ లేదా దర్శన టికెట్లు చూపించి భక్తులు లడ్డూలు తీసుకునే వారు. అయితే, టీటీడీ నూతన విధానం తీసుకొచ్చింది. ప్రయోగాత్మకంగా 5 కియోస్క్ మెషీన్లను లడ్డూ కౌంటర్ల దగ్గర ఏర్పాటు చేసింది.ఈ మెషిన్ లో భక్తులు తమ దర్శన టికెట్ టోకెన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత వారికి క్యూఆర్ కోడ్ వస్తుంది. దాన్ని ఫోన్ లో స్కాన్ చేయడం ద్వారా పేమెంట్ చేయాలి. ఆ తర్వాత ఒక స్లిప్ వస్తుంది. దాన్ని కౌంటర్ లో చూపిస్తే లడ్డూలు ఇస్తారు. దర్శన టికెట్ లేని భక్తులు సైతం లడ్డూలను పొందొచ్చు. అలాంటి భక్తులు తమ ఆధార్ నెంబర్ ను కియోస్క్ మెషిన్ లో నమోదు చేసి రెండు లడ్డూలను పొందొచ్చు. ఈ కొత్త సిస్టమ్ ని టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ విధానం అన్నప్రసాదంలో ఉంది. డోనర్లు 99వేల రూపాయల వరకు నేరుగా డొనేషన్ చేసుకునే విధంగా ఇలాంటి కియోస్క్ మిషన్లు పెట్టింది.తాజాగా తిరుమల లడ్డూ కౌంటర్లలో కూడా కియోస్క్ మిషన్లను టీటీడీ ఏర్పాటు చేసింది. భక్తులు మరింత సులభతరంగా లడ్డూలు పొందే అవకాశం ఉందని టీటీడీ అంటోంది. యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రస్తుతం 5 కియోస్క్ మిషన్లు ఏర్పాటు చేశారు. భక్తులు వీటి ద్వారా లడ్డూలు పొందుతున్నారు. కొన్ని రోజుల పాటు దీన్ని పరిశీలన చేసి ఇందులో ఏవైనా లోటుపాట్లు ఉంటే సరి చేసే విధంగా టీటీడీ దృష్టి పెట్టింది. అన్నప్రసాదం కేంద్రంలో డొనేషన్లు సమర్పించడానికి, లడ్డూలు పొందడానికి కియోస్క్ మెషిన్లు ఏర్పాటు చేసిన టీటీడీ త్వరలో గదులు పొందడానికి కూడా కియోస్క్ మెషిన్లు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.

Related Posts