
హైదరాబాద్
రాష్ట్రంలో అద్భుతమైన ప్రజా పాలన సాగుతోందని టీపీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కితాబునిచ్చారు. మంగళవారం నాడు గాంధీ భవన్ లో జరిగిన సమావేశంలో అయన పాల్గోన్నారు.
మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఏఐసీసీ మనకు ఇస్తున్న సూచనల మేరకు లక్ష్యాల మేరకు పని చేస్తున్నాం.. దేశానికి ఆదర్శంగా ఉండే విదంగా పాలన సాగుతుంది. అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా చేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి వర్గం అద్బుతమైన ఆలోచనలతో చేస్తున్నారు. ఏఐసీసీ ఇచ్చిన జైబాపు జై భీమ్ సంవిధాన్, సంస్థాగత నిర్మాణం తదితర కార్యక్రమాలను రాష్ట్రంలో చాలా బాగా అవుతున్నాయని ఏఐసీసీ నేతలు అభినందించారు. మనం కూడా రాష్ట్రంలో సంస్థాగత నిర్మాణం పకడ్బందీగా చేపట్టాలి.. అందుకు అందరూ పని చేయాలి. గ్రామాలలో ప్రభుత్వ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేపట్టాలి. రైతు భరోసా ఒక మంచి కార్యక్రమం ఇది గతంలో ఎన్నడూ లేని విదంగా 9 రోజులలో 9 వేల కోట్లు రైతులకు ఇవ్వడం జరిగింది.ఈ రోజు అన్ని ప్రాంతాలలో పెద్దఎత్తున ఉత్సవాలు ఘనంగా చేయాలని అన్నారు.