
అమరావతి
గత ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం అప్పుల మయం అయిపోయిందని, రాష్ట్రం శ్రీలంక అయిపోతోందని కూటమి నేతలు దుష్ప్రచారం చేశారని మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి విమర్శించారు. ఒకసారి 10 లక్షల కోట్లు అని, మరోసారి 15 లక్షల కోట్లని నోటికొచ్చినట్టు చంద్రబాబు అండ్ కో మాట్లాడారని అయితే కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఏడాది కాలంలోనే 30% అప్పులు చేశారని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.
మా హయాంలో 13% అప్పులు చేస్తే చంద్రబాబు హయాంలో 27% అప్పులు చేశారని బుగ్గన విమర్శించారు. మరి అప్పుడు మాట్లాడిన వారంతా ఇప్పుడు ఏమయ్యారు?, చేసిన అప్పులన్నీ ఏమవుతున్నాయి?, పోలవరం నిర్మాణానికి వచ్చిన రూ.5,052 కోట్లు ఏం చేశారు?, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వైఎస్ఆర్, వైఎస్ జగన్ ఎంతో కృషి చేశారు. పర్యావరణ అనుమతులు సహా అనేక క్లియరెన్సులు మా ప్రభుత్వంలోనే తెచ్చామని కానీ చంద్రబాబు మాత్రం ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని బుగ్గన ఆరోపించారు.