
తిరుపతి
జిల్లా వ్యాప్తంగా పోలీసులు అనధికారికంగా ప్రెస్, పోలీసు స్టిక్కర్ వేసుకున్న వాహనదారుల పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
అనధికారికంగా కార్లు, ద్విచక్ర వాహనాలపై ప్రెస్, పోలీస్ స్టిక్కర్ వేసుకుంటే అలాంటి వారి పై చర్యలు తీసుకుంటామని హెచ్చింరారు.
అనధికారికంగా ప్రెస్, పోలీసు స్టిక్కర్లు వేసుకున్న ప్రెస్ 2 వాహనాలు, పోలీసు 9 మంది వాహనదారులకు మొదటి తప్పు గా పరిగణలోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు.
తిరుపతి జిల్లాలో కొందరు జర్నలిస్టులు, పోలీసులు కాకున్నా తమ వాహనాలపై ప్రెస్, పోలీస్ అని స్టిక్కర్లు అతికించుకుని తిరుగుతున్నట్లు సమాచారం వచ్చింది. ప్రెస్, పోలీస్ విధులతో సంబంధం లేనివారు వాహనాలపై స్టిక్కర్లను అతికించుకోవడం చట్టపరపరంగా నేరం. ఇక నుండి ఎవరైన ప్రెస్, పోలీసు స్టిక్కర్స్ గుర్తింపు కార్డులు లేకుండా వేసుకుని తిరిగే అలాంటి వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసు వారు నిబంధనలు ఎవరు ఉల్లంఘించిన వారి వాహనాలను సీజ్ చేస్తామని అన్నారు.