YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కూటమి కాన్ఫిడెన్స్ లెక్కంటో...

కూటమి కాన్ఫిడెన్స్ లెక్కంటో...

విజయవాడ, జూన్ 25, 
ఏపీ పాలిటిక్స్‌లో మళ్లీ జగన్ వర్సెస్ పవన్ ఎపిసోడ్‌ ఇంట్రెస్టింగ్‌గా మారుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు ఆ ఇద్దరి మధ్య నెక్స్ట్‌ లెవల్‌లో మాటల యుద్ధం కొనసాగింది. ఇక ఏడాదిగా చూస్తే జగన్, పవన్‌ మధ్య అప్పుడప్పుడు డైలాగ్‌ వార్ నడుస్తున్నా ఇష్యూ బేస్డ్‌గా మాట్లాడి అక్కడితో వదిలేస్తున్నారు. ఇప్పుడు మరోసారి జగన్‌, వైసీపీపై పవన్ కౌంటర్లు వేస్తుండటంతో రాజకీయ వేడి రాజుకుంటోంది.జగన్‌ రెంటపాళ్ల పర్యటనలో ప్లకార్డులు, ఆ తర్వాత ఆయన కామెంట్స్‌తో పొలిటికల్ హీట్ పెరిగింది. వైసీపీ, జగన్‌ టార్గెట్‌గా పవన్ స్ట్రాంగ్‌ వార్నింగే ఇచ్చారు. తొక్కి నార తీస్తామని, మక్కెలు విరగగొట్టి కూర్చోబెడతామంటున్నారు పవన్. అసాంఘిక శక్తులను ఏరివేస్తామన్నారు. రోడ్లెక్కి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అసలు ఊరుకోమంటున్నారు. గొంతు కోస్తామని అంటే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. సరదాగా ఇక్కడ ఎవరూ కూర్చోలేదంటున్న పవన్..అధికారంలో ఉన్నపుడు అరాచకాలు సృష్టించారని ఇపుడు కూడా అలాగే చేద్దామనుకుంటే లైట్‌ తీసుకునే ముచ్చటే లేదంటున్నారు.అంతే కాదు కూటమి ఐక్యతకు తాను ప్రాధాన్యత ఇస్తాననని 20 ఏళ్లు కూటమే అధికారంలో కొనసాగుతుందని క్లారిటీగా చెబుతున్నారు పవన్. మళ్లీ జగన్‌ ప్రభుత్వం రానే రాదు..తాను మాట ఇస్తున్నానంటున్నారు పవన్. కనీసం పదిహేనేళ్లు కూటమి పవర్‌లో ఉంటుందని భరోసా ఇస్తున్నారు.అటు సీఎం చంద్రబాబు మాట తీరులోనూ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలకు వాస్తవాలు చెప్పాలనే ఆలోచన బాబు ప్రసంగాల్లో స్పష్టమవుతోంది. అన్నీ చేసేశామని చెప్పటం లేదు కానీ..ఊహించిన దానికంటే ఎక్కువగా..చెప్పనివి కూడా చేశామని మాత్రం చెప్పగలను అంటున్నారు చంద్రబాబు. కూటమి అధికారంలోకి వచ్చాక ఎక్కడ ప్రయాణం మొదలైందో..ఏడాదిలో ఏం సాధించామో ప్రజలే విశ్లేషించుకోవాలని కోరుతున్నారు.అయితే అటు చంద్రబాబు, ఇటు పవన్ మాటల్లో అయితే వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదనే భావన స్పష్టంగా కనిపిస్తోంది. దీని వెనుక మర్మమేంటన్న దానిపై మాత్రం పెద్దఎత్తున డిస్కషన్ జరుగుతోంది. ఇప్పటికే సూపర్ సిక్స్ స్కీమ్‌లలో చాలావరకు అమలు చేశారు. ఇంకా ఒకటో, రెండో స్కీమ్‌లు పెండింగ్‌లో ఉంటే..వాటిని ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తామో షెడ్యూల్ కూడా ప్రకటించేశారు.ఇక రోడ్లు బాగు చేశారు. ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు ఫోకస్ పెడుతున్నారు. పైగా వైసీపీ వ్యవహరిస్తున్న తీరు తమకు ప్లస్‌ పాయింట్‌ గా మారుతుందని భావిస్తున్నారట కూటమి పెద్దలు. అపోజిషన్‌లో ఉన్నప్పటికీ అరాచకాలు, అడ్డగోలు మాటలు.. మాట్లాడుతున్నారని..వైసీపీని ప్రజలు ఓడించిందే అందుకని..రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమి తప్పదని అంచనా వేస్తున్నారట కూటమి లీడర్లు.ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న స్కీమ్‌లు..ఇప్పటికీ ప్రజల్లో వైసీపీపై వ్యతిరేకత ఉందన్న నమ్మకం..కూటమి ఐక్యతే తమను తిరిగి మళ్లీ మళ్లీ నిలబెడుతుందని నమ్ముతున్నారట కూటమి అగ్రనేతలు. మొన్నటి ఎన్నికలకు ఇప్పటికి కూటమికి మైలేజ్‌ పెరిగిందని..చంద్రబాబు పాలనపై ప్రజలకు నమ్మకం ఉందని భరోసాగా ఉన్నారట. అందుకే వైసీపీ మళ్లీ రానే రాదన్న గట్టి నమ్మకంతో ఉన్నారట పవన్. పైగా మళ్లీ కూటమిగా వెళ్తామని చెప్పడం ద్వారా పబ్లిక్‌ మూడ్‌ను మరింతగా తమవైపునకు తిప్పుకునే స్కెచ్ వేస్తున్నారని అంటున్నారు.అయితే పవన్‌ మాటలను లైట్‌ తీసుకోలేమని అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. సేమ్‌టైమ్‌ పవన్‌ అంత నమ్మకంతో చెప్తున్నారంటే కూటమి దగ్గర ఫ్యూచర్ ప్లాన్స్ ఉండే ఉంటాయంటున్నారు. ఎలక్షన్స్‌ ముందు ఫాలో అయ్యే స్ట్రాటజీ.. స్కీమ్‌ల ఇంప్లిమెంటేషన్‌ కూడా అంతా పక్కా స్కెచ్ ప్రకారమే చేసుకుంటూ వస్తున్నారని చెప్పుకొస్తున్నారు. పవన్‌ మాటలు నిజం అవుతాయా? జగన్‌ ఒంటరి పోరు ఆయన్ను తిరిగి నిలబెడుతుందా? అనేది చూడాలి.

Related Posts