YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఇంటింటికి తొలి అడుగు

ఇంటింటికి తొలి అడుగు

విజయవాడ, జూన్ 26, 
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ అంతే. ఒకరు ప్రారంభించిన కార్యక్రమాన్ని మరొకరు మొదలు పెడతారు. ఆ కార్యక్రమం సక్సెస్ అయిందా? లేదా అన్నది చూడరు. 2019 ఎన్నికల్ల వైసీపీ గెలిచిన తర్వాత అనేకసంక్షేమ పథకాలను అమలు చేసింది. దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయల డబ్బులను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసింది. దీంతో వైసీపీ ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎమ్మెల్యేలను గడపగడపకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకోవాలని ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసింది. గడప గడపకు ప్రభుత్వం అని పేరుపెట్టింది. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే డిజైన్ తో టీడీపీ కార్యక్రమాన్ని సిద్ధం చేసింది. ఇంటింటికి తొలి అడుగు విజయయాత్రగా నామకరణం చేసింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఆదేశించారు. అంటే ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాల్సి ఉంటుంది. సూపర్ సిక్స్ హామీలను ఇప్పటికే చాలా వరకూ అమలు చేశామని, పింఛను నాలుగు వేల రూపాయలు ఇవ్వడంతో పాటు దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇవ్వడం, తల్లికి వందనం పథకం కింద పదమూడు వేల రూపాయలను ఒక్కొక్కరికి ఇవ్వడంతో పాటు ఆగస్టు పదిహేనో తేదీ నుంచి మహిళల ఉచిత బస్సు అమలు చేస్తామని చెప్పడం వంటివి చేయాలని చంద్రబాబు ఎమ్మెల్యేలకు, ప్రజప్రతినిధులకు చెప్పారు. జులై ఒకటో తేదీ నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి క్షేత్రస్థాయిలో నివేదికలను చంద్రబాబు తెప్పించుకుని ప్రజల మనోభావాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారట. ఉచిత ఇసుక, మద్యం వంటి విషయాల్లో కొందరు ఎమ్మెల్యేలు ఆరోపణలు ఎదుర్కొనడంతో వారిని కూడా జనం వద్దకు పంపాలన్నది చంద్రబాబు ప్రయత్నం. గత ఏడాది నుంచి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని వారికి వివరించి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా నియోజకవర్గం పరంగా ఏమి మంచి జరిగిందో జనాలకు వివరించి వారిలో ఏదైనా అసంతృప్తి ఉంటే దానిని తొలగించే ప్రయత్నం చేయాలని చంద్రబాబు ఆలోచన. అయితే జనం నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది ఎమ్మెల్యేలకు అంతుచిక్కడం లేదు.. చంద్రబాబు చేయించిన సర్వేల్లో ప్రభుత్వంపై సానుకూలత ఉన్నప్పటికీ ఎమ్మెల్యేల్లో ఎక్కువగా అసంతృప్తి ఉందని తేలింది. అందులో కొత్తగా ఎన్నికైన దాదాపు ఎనభై మంది ఎమ్మెల్యేల్లో అధిక శాతం కూడా ఉండటంతో వారిని ప్రజలతో మమేకం చేయాలని చంద్రబాబు ఈ కార్యక్రమాన్నితలపెట్టినట్లు కనపడుతుంది. దీంతో పాటు క్యాడర్ ను కూడా కలుపుకుని ఈ కార్యక్రమంలో పాల్గొనగలిగితే ఎమ్మెల్యేలకు, క్యాడర్ కు మధ్య ఉన్న గ్యాప్ కూడా తొలగిపోతుందని భావిస్తున్నారు. ఎన్నికలకు ముందు హడావిడి కాకుండా నాలుగేళ్ల ముందు నుంచే చర్యలు తీసుకోవడంతో పాటు కార్యకర్తలను కూడా మోటివేట్ చేయడం ఈ కార్యక్రమం లక్ష్యంగా కనిపిస్తుంది. మరి ఈ కార్యక్రమం ఏ మేరకు సక్సెస్ అవుతుందన్నది చూడాల్సి ఉంది.

Related Posts