
హైదరాబాద్
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ శుక్రవారం నాడు సిట్ విచారణకు హజరయ్యారు. అధికారులు అయనను గంటపాటు విచారించారు. తర్వాత ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. రాధాకృష్ణ ఫోన్ నంబర్లను ట్యాప్ చేసిన తేదీలు సమయాలను అధికారులు ఆయనకు చూపించినట్లు సమాచారం. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా సిట్ విచారణకు హాజరయ్యారు. అయనను విచారించి వాంగ్మూలాన్ని నమోదు చేసారుఏ. గతంలో బీఆర్ఎస్ s లో ఉన్న ఆయన అధినేత కేసీఆర్ తో విభేదించి పార్టీ నుండి బయటకు వచ్చారు. కొన్నాళ్ల తర్వాత బీజేపీ లో చేరారు. గత ఎన్నికలలో ఎంపీ గా ఆయన గెలుపొందారు. ఇక జర్నలిస్టుల ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఇప్పటికే సిట్ పదిమందికి పైగా జర్నలిస్టుల వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు తెలిసింది.