
న్యూఢిల్లీ, జూన్ 27,
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సంఘం నుంచి రాజకీయ పార్టీగా గుర్తింపు పొంది..2019 నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా జరిగిన ఎలాంటి ఎన్నికలలో పోటీ చేయని 345 పార్టీలను.. రాజకీయ పార్టీలను జాబితా నుంచి తొలగించేందుకు సిద్ధమైంది. ఈ ప్రక్రియను త్వరలోనే ప్రారంభించబోతున్నట్టు ఎన్నికల సంఘం పేర్కొంది.కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సంఘం నుంచి రాజకీయ పార్టీగా గుర్తింపు పొంది..2019 నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా జరిగిన ఎలాంటి ఎన్నికలలో పోటీ చేయని పార్టీలను.. రాజకీయ పార్టీలను జాబితా నుంచి తొలగించేందుకు సిద్ధమైంది. ఇలా గత ఆరేళ్లుగా ఏ ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా, ఎన్నికల సంఘం ముఖ్యమైన షరతును నెరవేర్చడంలో 345 రాజకీయ పార్టీలు విఫలమైనట్లు ఈసీ తెలిపింది.పార్టీలు గత కొంత కాలంగా కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని, దేశవ్యాప్తంగా ఎక్కడా తమ కార్యాలయాలను కూడా జరపలేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే సదరు పార్టీలను రాజకీయ పార్టీల జాబితా నుంచి తొలగించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నా్టు తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సుమారు 2,800కు పైగా గుర్తింపు లేని పార్టీలు ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయ్యి ఉన్నాయని ఈసీ పేర్కొంది. వీటిని తొలగించే ప్రక్రియను త్వరలోనే ప్రారంభించనున్నట్టు ఈసీ తెలిపింది.ఓటరు జాబితాలో అక్రమంగా చేరిన వారు, విదేశాల నుంచి వలస వచ్చిన వారు, మరణించినవారి పేర్లు తొలగించడానికి కొత్తగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను ప్రారంభించింది ఈ నేపథ్యంలో, ఓటుగా నమోదు కావాలంటే పుట్టిన తేదీ, జన్మించిన ప్రదేశాన్ని రుజువు చేసే ధ్రువపత్రాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ చర్యలు భారత పౌరసత్వ చట్టం, 1955లో పేర్కొన్న నిబంధనల ఆధారంగా తీసుకున్నవిగా ఈసీ స్పష్టం చేసింది. ఈసీ తెలిపిన ప్రకారం, గతంలో ఇంటెన్సివ్ రివిజన్ చివరిసారిగా 2003లో జరిగింది. అయితే, అప్పటి నుంచి దేశంలో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త ఓటర్లు వచ్చారు, చాలా మంది వలసబాటపట్టారు. కొందరి మరణాలు అధికారికంగా నమోదు కాలేదు. కొన్ని చోట్ల అక్రమ వలసదారులు ఓటర్ల జాబితాలో చేరినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి ఇంటెన్సివ్ రివిజన్ ప్రాధాన్యత పెరిగింది. ఇది కేవలం ఓటర్ల జాబితా పరిశుద్ధతకే కాకుండా, ప్రజాస్వామ్యంలో నమ్మకాన్ని పెంచే మార్గంగా కూడా కనిపిస్తోంది.