
సత్తెనపల్లి పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో వెలుగూరి అందించిన సేవలు వెలకట్టలేనివి,వెలుగూరి అనేకమంది నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపారు..కన్నా లక్ష్మీనారాయణ,,మాజీ మంత్రి వర్యులు మరియు సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు.*.............సోమవారం ఉదయం సత్తెనపల్లి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల ప్రక్కన ఉన్న కీర్తిశేషులు వెలుగూరి వెంకటేశ్వర్లు గారి విగ్రహం వద్ద ఆర్య వైశ్య చలివేంద్ర సంఘము ఆద్వర్యంలో వెలుగూరి వెంకటేశ్వర్లు యొక్క 53 వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి గజమాల వేసి కన్నా లక్ష్మీనారాయణ గారు ఘన నివాళులు అర్పించారు.అంతేకాకుండా సేవా కార్యక్రమాల్లో భాగంగా దివ్యాంగుడు అయినవోలు శ్రీనివాసరావు కు ట్రై సైకిల్ ను మరో నిరుపేద మహిళకు వెట్ గ్రైండర్ ను కన్నా లక్ష్మీనారాయణ గారి చేతులమీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న ఆర్య వైశ్య సంఘము నాయకులు,తెలుగుదేశం పార్టీలో ఉన్న వివిధ హోదాల్లో ఉన్న నాయకులు మరియు వెలుగూరి వెంకటేశ్వర్లు గారి అభిమానులు అందరు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతిఒక్కరికి వెలుగూరి శరత్ బాబు , జమిలి రాధా కృష్ణమూర్తి మరియు దివ్వెల శ్రీనివాసరావు లు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు పంపిణీ చేసిన వెట్ గ్రైండర్ ను వెలుగూరి వెంకటేశ్వర్లు గారి కుమార్తె వెచ్చా ఉదయలక్ష్మీ గారు దాత గా వీరి యొక్క ఆర్ధిక సహాయంతో పంపిణీ చేయగా,కుట్టు మిషన్ ను వెలుగూరి వెంకటేశ్వర్లు గారి మరో కుమార్తె తూనుగుంట్ల రాజ్యలక్ష్మి గారి యొక్క ఆర్ధిక సహాయంతో పంపిణీ చేశారు.అదేవిదంగా ట్రై సైకిల్ ను వెలుగూరి వెంకటేశ్వర్లు గారి మనవళ్ళు వెంకట్ మరియు మల్లికార్జునరావు ల యొక్క ఆర్ధిక సహాయంతో పంపిణీ చేశారు.