YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నిఘా నీడలో ఎమ్మెల్యేలు

నిఘా నీడలో ఎమ్మెల్యేలు

విజయవాడ, జూలై 3, 
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కొందరు ఎమ్మెల్యేలపై ఆగ్రహంతో ఉన్నారు. నాన్ సీరియస్ కేటగిరీలోని ఎమ్మెల్యే జాబితా రెడీ అవుతుంది. ప్రజాసమస్యలు పట్టించుకోకుండా ఎమ్మెల్యేగా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించకుండా సొంత పనులపైనే దృష్టి పెడుతున్న ఎమ్మెల్యేల జాబితాను సిద్ధం చేస్తున్నట్లుసమాచారం. వారు నియోజకవర్గానికి దూరంగా వ్యాపారాలు ప్రధానంగా వ్యాపకం చేసుకుంటూ కాలం వెళ్ల దీస్తున్న ఎమ్మెల్యేలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఇప్పటికే పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో గైర్హాజరయిన ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు యాభై మంది సమావేశానికి రాకపోవడానికి గల కారణాలను తెలుసుకుని వారిని వ్యక్తిగతంగా పిలిచి క్లాస్ పీకాలని నిర్ణయించారు. . కొందరు సమావేశానికి వచ్చి సంతకాలు చేసి వెళ్లడం కూడా చంద్రబాబు సీరియస్ అయ్యారు. పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా తాను సమావేశంలో ఎక్కువ సేపు సమావేశంలో గడిపితే కనీసం కూర్చునే ఓపిక లేని ఎమ్మెల్యేలను ఉపేక్షించడం అనవసరమని భావిస్తున్నారు. ఆధ్యాత్మక పర్యటనలకు, విదేశీ పర్యటనలకు వెళ్లడం మంచిదేనని, అయితే సమయం సందర్భం ఉండాలి కదా అని చంద్రబాబు నేతలను నిలదీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేటి నుంచి తొలి అడుగు ఇంటింటికి కార్యక్రమం ప్రారంభం కానుండటం, నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరగుతుండటంతో ఇది పూర్తయిన తర్వాత వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని పిలిచి క్లాస్ పీకే అవకాశాలు కనిపిస్తున్నాయి. . నాటా, అటా సభలకు ముందుగానే అమెరికా ప్రయాణం పెట్టుకున్న వారి విషయంలోనూ చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. అయితే దీంతో పాటు ఇంటింటికి తొలి అడుగు కార్యక్రమంలో ఎలా పాల్గొన్నారన్న దానిపై కూడా నివేదికలు తెప్పించుకునే అవకాశముంది. ఎమ్మెల్యేలు స్వయంగా ఇంటికి వెళుతున్నారా? లేక తమ అనుచరులును పంపుతున్నారా? అన్న దానిపై కూడా నివేదికలు ఎప్పటికప్పుడు కేంద్ర పార్టీ నుంచి నివేదికలు తెప్పించుకునే అవకాశాలున్నాయి. చంద్రబాబు పార్టీ పరమైన కార్యక్రమాలను నిర్లక్ష్యం చేస్తే సహించకూడదని నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉండని వారిని వదులుకునేందుకు కూడా సిద్ధమని చెబుతున్నారు. ఇప్పటికి ఏడాదే అయింది కాబట్టి.. హెచ్చరికలు జారీ చేస్తున్నారని.. సీరియస్ గా తీసుకోని వారి విషయంలో.. తర్వాత ఎంత ఒత్తిడి చేసినా ప్రయోజనం ఉండదని అంటున్నారు.

Related Posts