YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

లోకల్ బాడీ ఎన్నికలకు రెడీ

లోకల్ బాడీ ఎన్నికలకు రెడీ

హైదరాబాద్, జూలై 3, 
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో త్వరలోనే ఎన్నికల నగరా మోగనుందని చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. కాగా, స్థానిక సంస్థల ఎన్నికలు ఈ ఏడాది సెప్టెంబర్ 30లోపు పూర్తి చేయాలని హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.తెలంగాణలో పల్లెల్లో త్వరలోనే ఎన్నికల జాతర మెుదలు కానుంది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వంటి స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తదితరులు సీఎంను కలవగా.. వారితో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. త్వరలోనే రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. గచ్చిబౌలి, బాగ్ లింగంపల్లిలోని తమ ట్రస్ట్ భవనాలకు పన్ను మినహాయింపు ఇవ్వాలని సీపీఎం నేతలు కోరగా.. ఈ విషయాన్ని పరిశీలిస్తానని సీఎం హామీ ఇచ్చారు. సేవాభావంతో పనిచేస్తున్నందున పన్ను మినహాయింపు ఇవ్వాలని సీపీఎం నేతలు కోరారు.కాగా, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఇటీవల కీలక తీర్పు వెలువరించింది. సెప్టెంబర్ 30, 2025లోపు సర్పంచ్ ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించడం లేదంటూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెలువరించింది. ప్రభుత్వం 30 రోజులు, ఎన్నికల సంఘం 60 రోజులు సమయం కోరినప్పటికీ న్యాయస్థానం 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. తెలంగాణలో సర్పంచుల పదవీకాలం 2024 ఫిబ్రవరి 1న ముగియగా, మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ఈ ఏడాది జనవరి 26న పూర్తయ్యింది.అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వ హామీ, 50 శాతం రిజర్వేషన్లు మించకూడదన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం రిజర్వేషన్లపై తర్జనభర్జన పడుతోంది. చట్టప్రకారం బీసీలకు రిజర్వేషన్ ఖరారు కాకుంటే పార్టీ తరపున అయినా అమలు చేయాలని భావిస్తోంది. అందుకు కసరత్తు సైతం మెుదలుపెట్టింది. ఇక ఇటీవల హైకోర్టు తీర్పుతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వేగవంతం అయింది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సైతం స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక ప్రకటన చేయటంతో ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహులు సమరానికి సిద్ధమవుతున్నారు.
కాంగ్రెస్ దృష్టి
 ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈనెల 4న హైదరాబాద్ కు రానున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగే గ్రామస్థాయి కార్యకర్తల స మావేశంలో ఆయన పాల్గొని దిశా నిర్దేశనం చేయనున్నారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి నాయకులకు కార్యకర్తలకు పలు సూచనలు చేయనున్నారు. స్థానిక సమరానికి అధికార కాంగ్రెస్ పార్టీ సన్నద్ధం అవుతోంది.ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా సత్తా చాటి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఆ మేరకు క్షేత్రస్థాయిలో ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని, కార్యక ర్తలను పార్టీ పెద్దలు అప్రమత్తం చేస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ నా యకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అన్ని స్థానాల్లో పార్టీ జెండా ఎగురవేయాలని, ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారుఈ మేరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి గ్రా మస్థాయి నుంచి కార్యకర్తలను ఖర్గే సభకు తరలించేందుకు నాయకులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పీసీసీ ఇంచార్జి లుజిల్లాల్లో పర్యటించి ఈనెల 4న జరిగే సభ పై దిశా నిర్దేశం చేశారు. పార్టీని ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరింత బలోపేతం చేయడంతో పాటు నిర్మాణం చేసే దిశగా పిసిసి అడుగులు వేస్తున్న క్రమంలో జిల్లాలో పార్టీ పదవులు ఆశిస్తున్న నేతలు కార్యకర్తలను తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఖర్గే సభకు నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కదిలి వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఇటీవల పిసిసి ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మన జిల్లాకి చెందిన నేతలు తమకు కేటాయించిన జిల్లాలో పర్యటించడమే కాకుండా తమ ప్రాంత పరిధి నుండి కార్యకర్తలను తరలించే దిశగా ప్రయత్నిస్తున్నారు. కరీంనగర్ జిల్లాకు సంబంధించి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో రెండు రోజులుగా పార్టీ సమావేశాలు జరుగుతున్నాయి.సభకు ఇక్కడి నుండి భారీ సంఖ్యలో కార్యకర్తలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ ఇక్కడే మకాం వేసి కార్యకర్తలను సభకు సన్నద్ధం చేస్తున్నారు. సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అర్బన్ ప్రాంతం నుండి నాయకులతో సమావేశమయ్యారు. పార్లమెంట్ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు కూడా పార్లమెంట్ పరిధిలోని నాయకులతో సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ సమావేశంలో పాల్గొని ఖర్గే సభకు కావలసిన ఏర్పాట్లకు హామీ ఇచ్చారు. మొత్తంగా ఖర్గే సభ అనంతరం గ్రామస్థాయిలో కార్యకర్తలు, నాయకులు రెట్టింపు పని చేసేందుకు సిద్ధం చేయాలని పార్టీనిర్ణయించింది.

Related Posts