
తిరుపతి
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం అర్థరాత్రి ప్రాంతంలో ఆలయం ప్రవేశద్వారం వద్ద ఉన్న దుకాణాల పందిళ్లకు మంటలు అంటుకున్నాయి. ఈ మంటల్లో పందిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే రెండు ఫైర్ ఇంజన్లు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఒక ఫోటో స్టూడియో అగ్నికి ఆహుతి అయింది.