
తిరుపతి
చంద్రగిరి మండల వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు అజయ్ కుమార్తన కుటుంబం పై టీడీపీ నేతలు దాడి చేసారని ఆరోపించాడు. వైసీపీ పార్టీలో యాక్టివ్ గా ఉన్నానని, లేనిపోని ఆరోపణలు చేస్తూ నాపై, నా కుటుంబం పై దాడి చేశారు. నా భార్యను కిందపడేసి కాళ్లతో తొక్కి చంపాలని చూశారు. డయల్ 100కు ఫోన్ చేస్తే పోలీసులు స్పందించలేదు. ఇప్పటికి కూడా న్యాయం జరుగుతుందని నమ్మకం లేదని అన్నారు. భార్య, పిల్లలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని అన్నారు. పోలీసు స్టేషన్, అంబెద్కర్ విగ్రహం ముందు బైఠాయించి నిరసన తెలిపాడు.