
విజయవాడ, జూలై ,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది. శ్రావణ మాసంలో పేదలకు ఇళ్లు కేటాయించాలని నిర్ణయించింది. ఈ నెలాఖరు నుంచి వచ్చే నెల మొదటి వారం వరకూ దాదాపు మూడు లక్షల ఇళ్లను లబ్దిదారులకు అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. శ్రావణమాసంలో పేదల ఇళ్లలో సామూహిక గృహ ప్రవేశాలు చేయించాలని సిద్ధమయింది. ఇప్పటికే పనులు పూర్తి చేయడం కోసం లబ్దిదారులకు మూడు వందల కోట్ల రూపాయలను విడుదల చేసి ప్రభుత్వం అధికారులను కూడా ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ మూడు లక్షల ఇళ్లను... కూటమి ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది పూర్తి కావస్తుండటంతో పేదలకు మూడు లక్షల ఇళ్లను అప్పగించి వారిని ఇంటి యజమానులుగా చేయాలన్న లక్ష్యంతో ఈ మెగా ఈవెంట్ కు శ్రీకారం చుట్టింది. ఈ సామూహిక పేదల ఇళ్ల గృహప్రవేశాలను శ్రావణమాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తిచేస్తున్నారు. మిగిలిపోయిన పనులను వీలయినంత త్వరగా పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అధికారులకు అందాయి.. గత ఏడాది కాలంలో దాదాపు 2.30 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. చిన్న చిన్న పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇక రూఫ్ స్థాయిలో దాదాపు ఎనభై ఏడు వేల ఇళ్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. లింటెట్ స్థాయిలో 1.2 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉండగా, పునాది వేసిన ఇళ్లు యాభై వేల వరకూఉన్నాయి. దీంతో వీటిని పూర్తి చేయడానికి అధికారుల సిద్ధమయ్యారు. ఇసుక కూడా సిద్ధంగా ఉంచడంతో వేగంగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలన్న లక్ష్యంతో అధికారులు నిర్విరామంగా పనిచేస్తున్నారు.లబ్దిదారులకు సాయం... మంజూరయిన ప్రతి ఇంటికి కేంద్ర ప్రభుత్వం లక్షన్నర రూపాయలు చెల్లిస్తుంది. గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ పథకం కింద మరో ముప్ఫయి వేలు అదనంగా ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం దీనికి అదనంగా వెయ్యి రూపాయలుచెల్లిస్తుంది. రూరల్, అర్బన్ ఏరియాల్లోని ఎస్సీ లబ్దిదారులకు , బీసీలకు యాభై వేల రూపాయలు చొప్పున, ఎస్టీలకు 75 వేల రూపాయలు, ఆదివాసీ గిరజనులకు లక్ష రూపాయలు అదనంగా సాయం అందిస్తుంది. వేగంగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి శ్రావణమాసంలో మూడు లక్షల ఇళ్లను ఒకేసారి ప్రారంభించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు.