YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆనం అసంతృప్తికి కారణం అదేనా

ఆనం అసంతృప్తికి కారణం అదేనా

నెల్లూరు, జూలై 9, 
ఆనం రామనారాయణరెడ్డి ఎప్పుడూ అసంతృప్తి నేత మాత్రమేనా? జిల్లాలో తన మాట శాసనం అనుకుంటున్నారా? ఇంకా పాత కాలం నాటి రోజులుగా ఆనం రామనారాయణరెడ్డి భావిస్తున్నట్లుంది. సాక్షాత్తూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఎదుటే మంత్రి నారాయణపై అసంతృప్తిని వెళ్లగక్కి ఆనం రామనారాయణరెడ్డి తన దైన శైలిని ఆయన మరోసారి చాటుకున్నారు. అందుకే సీనియర్ నేతలను పక్కన పెట్టి కొత్త తరం నేతలను రాజకీయాల్లోకి తీసుకు రావాలన్న టీడీపీ అధినాయకత్వం ఆలోచన కరెక్టే అనిపిస్తుంది. ఈ సీనియర్లు తమదే ఆధిపత్యం కావాలని కోరుకుంటారు. ఫలితంగా పార్టీలో రాజకీయ ఇబ్బందులు తలెత్తక తప్పవు. అందుకే టీడీపీలో క్రమంగా సీనియర్ నేతలను పక్కన పెడుతున్నారు.. నెల్లూరు నగరంలో నిన్న అంతర్జాతీయ ప్రమాణాలతో నిరుపేద విద్యార్థులు చదువుకోవడానికి వీఆర్ హైస్కూల్ ను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. మంత్రి నారాయణ మున్సిపల్ నిధులు వెచ్చించి ఈ పాఠశాలకు మరమమ్మతులుచేయించారు. దీంతో వీఆర్ మున్సిపల్ హైస్కూలు అని నామకరణం చేశారు. అందుకు ఆనం రామనారాయణరెడ్డి అభ్యంతరం తెలిపారు. తమ కుటుంబం ఆధ్వర్యంలో దశాబ్దాలుగా ఉన్న వీఆర్ విద్యాసంస్థలను మున్సిపల్ స్కూలు అని ఎలా నామకరణం చేస్తారని లోకేశ్ ఎదుటే ప్రశ్నించారు. నారాయణ తన శాఖ నిధులతో ఖర్చు చేస్తే పేరు మారుస్తారా? అని నిలదీశారు. అంతేకాదు నారాయణ మున్సిపల్ పాఠశాలలను దత్తత తీసుకుని వాటిని బాగు చేస్తే మంచిదని హితవు పలికారు. ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలతో లోకేశ్ సయితం విస్తుపోయారు ఆనం రామనారాయణరెడ్డి కాంగ్రెస్ లో ఉన్ననాళ్లు మంత్రిగా ఉండి జిల్లాపై ఆధిపత్యాన్ని చెలాయించారు. అయితే 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆయన టీడీపీలో చేరారు. కానీ ఆ ఎన్నికల్లో గెలవలేకపోయారు. కానీ తనకు ఎమ్మెల్సీ సీటు కూడా ఇవ్వలేదని నాడు టీడీపీని వదిలేశారు. 2019 ఎన్నికలనాటికి వైసీపీలో చేరారు. వెంకటగిరి నియోజకవర్గం నుంచి టిక్కెట్ పొంది విజయం సాధించారు. అయితే జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు మంత్రి వర్గంలో చోటు దక్కలేదు. దీంతో అసంతృప్తికి గురయిన ఆనం రామనారాయణరెడ్డి ఎన్నికలకు ముందు నుంచే అధికార వైసీపీ ప్రభుత్వంపై తరచూ విమర్శలు చేస్తూ వార్తల్లోకి ఎక్కారు. అంటే మరోసారి పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. గతంలో టీడీపీని వదిలి వెళ్లినా ఆనం రామనారాయణరెడ్డిని చంద్రబాబు నాయుడు తిరిగి పార్టీలోకి తీసుకున్నారు. ఆనం కుటుంబానికి నెల్లూరులో ఉన్న పేరు ప్రఖ్యాతుల దృష్ట్యా ఆయనను తిరిగి పార్టీలోకి తీసుకుని ఆత్మకూరు నియోజకవర్గం టిక్కెట్ ను 2024 ఎన్నికల్లో కేటాయించారు. ఈ ఎన్నికల్లో గెలిచిన ఆనం రామనారాయణరెడ్డికి మంత్రివర్గంలో చోటు కూడా కల్పించారు. అయితే తనకు ఇష్టంలేని దేవాదాయ శాఖను అప్పగించడం కొంత అసంతృప్తికి గురైన ఆనం అందులోనే ఉంటూ సర్దుకుపోతున్నారు. కానీ నెల్లూరు జిల్లాలో సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని కాదని ఆనం రామనారాయణరెడ్డి కి మంత్రిపదవి ఇచ్చినా ఆయన తృప్తిపడనట్లే కనిపిస్తుంది.. నెల్లూరు జిల్లాలో మంత్రి నారాయణ హవా నడుస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, లోకేశ్ కు నారాయణ సన్నిహితుడు కావడంతో జిల్లా అధికారులు కూడా ఆయనకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది ఆనం రామనారాయణరెడ్డికి ఇబ్బందికరంగా మారింది. తన సొంత జిల్లాలో నారాయణ పెత్తనమేంటన్న అభిప్రాయం ఆయనలో బలంగా ఉన్నట్లుంది. అందుకే లోకేశ్ వేదికపైనే ఉన్నా ఏ మాత్రం సంకోచం లేకుండా విమర్శలు చేయడంతో నెల్లూరు టీడీపీలో విభేదాలు బయటకు భగ్గుమన్నాయి. ఈ విషయాన్ని పార్టీ అధినాయకత్వం సీరియస్ గా తీసుకున్నట్లు తెలిసింది. ఆనం రామనారాయణరెడ్డి ఎప్పుడూ ఆధిపత్యం కోసమే ప్రయత్నిస్తుంటారని, అందులో భాగంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

Related Posts