
హైదరాబాద్
ప్రముఖ నటి, పద్మభూషణ్ గ్రహీత బి. సరోజా దేవి మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చలన చిత్ర రంగంలో ముఖ్యంగా తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో మరిచిపోలేని అనేక పాత్రలు పోషించారని గుర్తుచేసుకున్నారు. చలన చిత్ర రంగంలో వారు లేని లోటు పూడ్చలేనిదని, సరోజా దేవి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు.