
వేములవాడ
ఇది దొంగ గవర్నమెంట్, లంగ గవర్నమెంట్.. ఈ గవర్నమెంట్ నాశనం అయిపోను. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నిన్ను గెలిపిస్తే నా కొంపను కూల్చివేస్తావా అని ఒక మహిళా శాపనార్ధాలు పెట్టింది. నష్టపరిహారం ఇవ్వకుండా వేములవాడలో అధికారులు అర్ధరాత్రి దుకాణాలను కూల్చివేసారని ఆరోపించింది. వేములవాడ పట్టణంలోని మూలవాగుపై నిర్మిస్తున్న రెండో వంతెన కోసం ఇరువైపుల షాపులను కూల్చివేసారు. ఎలాంటి పరిహారం ఇవ్వకుండా ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసారని అన్నాది. నిన్న అర్ధరాత్రి ఖాళీ చేయాలని హుకుం జారీ చేసి తిప్పాపూర్ దుకాణాల ముందు భారీ జేసీబీలు నిలిపారు. కిరాయిదారులు, యజమానులు బిక్కుబిక్కుమంటూ అప్పటికప్పుడు దుకాణాలను ఖాళీ చేసారు. అర్ధరాత్రి కూల్చివేతలు ఏంటంటూ ప్రభుత్వంపై ప్రజలు దుమ్మెత్తి పోసారు.