YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అధికార, ప్రతిపక్ష నేతల మధ్య సర్దుబాటు

అధికార, ప్రతిపక్ష నేతల మధ్య సర్దుబాటు

విజయవాడ, జూలై 9, 
ఏపీలో వ్యవస్థీకృత దోపిడీ జరుగుతోందా? అంతా కలిసి కానిచ్ఛేస్తున్నారా? బహిరంగంగా విమర్శలు చేసుకొని.. పరోక్షంగా సహకారం అందించుకుంటున్నారా? నీకింత నాకింత అంటూ వాటాలు వేసుకొని దోపిడీకి తెర తీశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. అన్ని రకాల వ్యవస్థలు, పాలసీలు గాడిలో పడ్డాయి. అదే సమయంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య సర్దుబాటు కూడా సవ్యంగా సాగిపోతున్నట్లు తెలుస్తోంది. మద్యం, ఇసుక, మట్టి.. ఇలా అన్ని రకాల మాఫియాలు కోరలు చాస్తున్నాయి. కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నాయి. రోజువారి ఆదాయం, కమీషన్లతో వందల కోట్ల రూపాయలు పక్కదారి పడుతుంది. ఎవరున్నా ఏం గర్వకారణం అంటూ తతంగం సాగుతోందిఏపీలో దోపిడి పార్ట్నర్స్ కొనసాగుతోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. సాధారణంగా రాజకీయ నేతలకు అనుచరులు, ఆప్తులు, బంధువులు ఉంటారు. వారికి ఆ నేత ప్రాధాన్యం ఇస్తుంటారు. కానీ ఇప్పుడు కొత్త రిలేషన్ పుట్టుకొచ్చింది. అదే ప్రాణం కంటే మించి మారిపోయింది. డబ్బులు ఊరికే రావన్న ఓ ప్రకటన చూసి స్ఫూర్తి పొందారు నేతలు. తెర ముందు కొట్టుకుందాం.. తెర వెనుక పంచుకుందాం అన్న మాదిరిగా చేతులు కలిపారు. కోట్లు కొల్లగొడుతున్నారు. బయటకు మాత్రం స్ఫూర్తిదాయకమైన మాటలతో గడుపుతున్నారు. నా పేరిట ఒక్క కంపెనీ అయినా ఉందా.. ఒక్క మద్యం దుకాణం అయినా ఉందా అంటూ తేలికపాటి మాటలు చెబుతున్నారు. తెర వెనుక బినామీలను పెట్టి.. మేమున్నాం గో హెడ్ అంటూ ప్రోత్సహిస్తున్నారు.జగన్ హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపింది. ప్రభుత్వ పెద్దలే దోపిడీ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల చేతికి మద్యం షాపులు వెళ్లాయి. కానీ గతం మాదిరిగా మద్యం వ్యాపారులు మాత్రమే ఈ దుకాణాలు నడపడం లేదు. తెర వెనుక ఎమ్మెల్యేలు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. పెట్టుబడి పెట్టేందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు.. ప్రతిపక్ష నేతలు ఫండింగ్ ఇచ్చారు. ఇది అన్ని చోట్ల బాహటంగానే కనిపిస్తోంది. కానీ మీడియా ముందు.. వివిధ వేదికల వద్ద మాత్రం రాజకీయంగా వారు విభేదించుకుంటున్నారు. కానీ వ్యవస్థీకృత దోపిడీ విషయంలో మాత్రం పరస్పరం సహకారం అందించుకుంటున్నారు. తెలుగు నాట ఏ ప్రాంతంలో చూసిన ఇది కనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీలో మాత్రం ఈ దోపిడీ రోజురోజుకు విస్తృతం అవుతోంది.ఒక్క మద్యం కాదు.. మట్టి, ఇసుక మాఫియ కు అంతులేకుండా పోతుంది. నదుల్లో ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పేరుకే ఉచితం కానీ.. ఆ ఉచితం మాటున పెద్ద ఎత్తున ఇసుకను తరలించి వందల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. మట్టి మాఫియా చెలరేగిపోతోంది. అయితే ఇది గ్రామాలకు కూడా విస్తరిస్తోంది. చెరువులతో పాటు కాలువల అభివృద్ధి పేరిట మట్టిని తోడేస్తున్నారు. తోడేళ్లుగా మారుతున్నారు. అయితే నాడు జగన్మోహన్ రెడ్డి అయినా.. నేడు చంద్రబాబు అయినా వీటిని ప్రోత్సహించడం అనేది నేరమే అవుతుంది. అయితే ఏపీలో ఈ వ్యవస్థీకృత దోపిడీ ఎవరు అధికారంలో ఉన్న.. అనధికారికంగా జరుపుతూనే ఉన్నారు.

Related Posts