YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

దారి తప్పుతున్న బండి

దారి తప్పుతున్న బండి

హైదరాబాద్, జూలై 9, 
మీడియాకు, రాజకీయ నాయకులకు ఉన్న అవినాభావ సంబంధం ఈనాటిది కాదు.. వెనుకటి కాలంలో నచ్చిన ముఖ్యమంత్రి ఉండడానికి తెలుగు నాట ఓ మీడియా అధినేత ఏకపక్ష రాతలు రాశాడు. మొదట్లో ఆ ముఖ్యమంత్రికి ఆ మీడియా అధినేత కు మధ్య సంబంధం బాగానే ఉండేది. ఆ సంబంధం చెడిపోయిన తర్వాత ఆ మీడియా అధినేత ఆ ముఖ్యమంత్రిపై తీవ్రతి తీవ్రమైన స్థాయిలో వార్తలు రాయించాడు. కార్టూన్లు గీయించాడు. ఈ ఉదంతం తెలుగు రాష్ట్రంలోనే కాదు.. జాతీయస్థాయిలోనూ అప్పట్లో చర్చకు దారితీసిందిఆ తర్వాత ఆ మీడియా అధినేత మరో ముఖ్యమంత్రికి దగ్గర వ్యక్తిగా మారిపోయాడు. తన సంస్థ ప్రయోజనాలకు అనుగుణంగా వార్తలు రాయడం మొదలుపెట్టాడు. నచ్చని వాళ్ళ మీద విష ప్రచారం చేశాడు. అతను మాత్రమే కాదు మీడియాలో ఉండే ఏ వ్యక్తయినా సరే ఇలాంటి విధానాలనే అనుసరిస్తారు. అది కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు.. జాతీయస్థాయిలోనూ ఇదే దరిద్రం కొనసాగుతోంది. గత చరిత్ర తీసుకున్నా.. ఇప్పటి వర్తమానాన్ని పరిశీలించినా మీడియా అధినేతలు ఎప్పుడు కూడా వారి ప్రయోజనాలు మాత్రమే చూసుకుంటారు. అధికారంలో ఉన్న పార్టీకి మాత్రమే డప్పు కొడతారు.ఇక ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కూటమి, కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. ఈ పార్టీలకు డప్పులు కొట్టే మీడియా సంస్థలు చాలానే ఉన్నాయి. ఒకప్పుడు ప్రతిపక్షానికి అంతగా వాయిస్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు కూడా ఒకప్పుడు అధికారంలో ఉన్నవే. అందువల్లే భారీగా డబ్బులు వెనకేసుకుని న్యూస్ ఛానల్స్ రన్ చేస్తున్నాయి. సో మీడియా అనేది ఇప్పుడు రూలింగ్, నాన్ రూలింగ్ కేటగిరిగా మారిపోయింది. సహజంగానే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికారంలోకి రావాలి అనుకుంటుంది. అందుకోసం ఏవైనా చేస్తుంది. ఇక రూలింగ్ లో ఉన్న పార్టీ వచ్చే సారి కూడా అధికారాన్ని దక్కించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. అంటే నిత్యం అటు రూలింగ్.. ఇటు నాన్ రూలింగ్ పార్టీల మీడియా సంస్థలకు చేతినిండా పని ఉంటుంది. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం.. ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం ఇదే పని.ఇటీవల ఓ న్యూస్ ఛానల్ భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు మీద పనికిమాలిన తంబ్ నైల్స్ పెట్టింది. అవి కాస్త సంచలనంగా మారాయి. దీంతో భారత రాష్ట్ర సమితి నాయకులు స్పందించారు. ఆ న్యూస్ ఛానల్ కార్యాలయం మీద దాడి చేశారు. ఆ దాడి అనంతరం భారత రాష్ట్ర సమితి నాయకులు రెచ్చిపోయి.. మీడియాకు ప్రాంతీయ భేదాన్ని ఆపాదించారు. సీమాంధ్ర మీడియా అంటూ విమర్శించారు. ఎప్పుడైతే సీమాంధ్ర మీడియా అంటూ గులాబీ నాయకులు వ్యాఖ్యలు చేశారో.. ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ స్పందించారు. ఆయన ఒక అడుగు ముందుకేసి తెలంగాణ కెసిఆర్ జాగీర్ కాదు అంటూ మండిపడ్డారు. తన సంపాదకీయంలో చాలా ఘాటు పదాలు వాడారు. దీంతో వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఏబీఎన్, ఆంధ్రజ్యోతి సంస్థల కార్యాలయాల ఎదుట ప్రభుత్వం పోలీసులతో భద్రత కల్పించింది. ఆ దృశ్యాలను ఉదయం నుంచి గులాబీ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో తెగ తిప్పుతున్నారు. దెబ్బకు పోలీసుల పహారాతో కార్యాలయాలు నిర్వహిస్తున్నారని ఎగతాళి చేశారు. ఇక ఇదే క్రమంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. ఆంధ్రజ్యోతి సంస్థలపై గులాబీ పార్టీ కార్యకర్తలు దాడులు చేస్తే తాము టీ న్యూస్ పై దాడులకు దిగాల్సి ఉంటుందని హెచ్చరించారు.రామచంద్రరావు మాటలను ఉటంకిస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా తీవ్రంగా స్పందించారు. ఒకవేళ ఆర్కే నిర్వహిస్తున్న మీడియా సంస్థల మీద దాడులు చేస్తే.. కచ్చితంగా తెలంగాణ భవన్ మీద తాము దాడులు చేస్తామని హెచ్చరించారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల గులాబీ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. ఆ ఛానల్, పేపర్ ను నెత్తిన పెట్టుకొని తిరుగు బండన్నా.. నువ్వు కేంద్ర మంత్రివా? ఆ సంస్థలో ఉద్యోగివా? లేక రాధాకృష్ణకు దగ్గరి బంధువువా? అంటూ విమర్శిస్తున్నారు.

Related Posts