
కరీంనగర్, జూలై 9,
కరీంనగర్ లో సింగరేణి కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఒకరోజు టోకెన్ సమ్మె చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మె కారణంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ పడనుంది. ఒక్కరోజు సమ్మెతో దాదాపు 76 కోట్ల రూపాయల విలువ చేసే బొగ్గు ఉత్పత్తికి నష్టం కలగనుంది.కేంద్ర ప్రభుత్వం విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ ఒక్కరోజు టోకెన్ సమ్మెకు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా సింగరేణిలోనూ సమ్మెకు పిలుపునిచ్చాయి. ఇప్పటికే కార్మిక సంఘాలన్నీ సింగరేణిలో సమావేశం నిర్వహించారు. ఒక్కరోజు సమ్మె విజయవంతం కోసం కార్మిక సంఘాలన్నీ గేట్ మీటింగ్ నిర్వహించాయి. విస్తృతంగా ప్రచారం చేశాయిమార్చి 20న సమ్మె చేయాలని అనుకున్నా.. యుద్ధం కారణంగా ఈ సమ్మె వాయిదా పడింది. గేట్ మీటింగ్ ల ద్వారా కార్మిక సంఘాలన్నీ విస్తృతంగా ప్రచారం చేశాయి. ఒక్కరోజు సమ్మెతో సింగరేణిపై పెనుభారం పడనుంది. దీంతో సమ్మెకు వెళ్లొద్దని సింగరేణి యాజమాన్యం కోరుతోంది. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం సమ్మెకు వెళ్తామని కార్మిక సంఘాలు చెబుతున్నాయి.సింగరేణి వ్యాప్తంగా ఉన్న ఐదు జాతీయ సంఘాల్లో నాలుగు AITUC, INTUC, CITUC, HMS.. సమ్మెకు మద్దతు తెలిపాయి. బీజేపీ అనుబంధ సంఘం BMS మాత్రం సమ్మెకు దూరంగా ఉంది. బీఆర్ఎస్ కు అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కూడా సమ్మెకు మద్దతు తెలిపింది. విప్లవ కార్మిక సంఘాలు సైతం సింగరేణి సమ్మెకు మద్దతు ప్రకటించాయి. కార్మికుల హక్కులు రక్షించుకోవాలంటే సమ్మెలో కచ్చితంగా పాల్గొనాలని కార్మిక సంఘాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. రేపటి సమ్మెను విజయవంతం చేసే దిశగా కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా, ముమ్మరంగా ప్రచారం చేశాయి.సమ్మె చేస్తే సింగరేణిపై పెను భారం పడే అవకాశం ఉంది. ఒక్కరోజు సమ్మెతో దాదాపు 76 కోట్ల రూపాయల విలువైన బొగ్గు ఉత్పత్తికి నష్టం జరుగుతోంది. సమ్మెలో పాల్గొనే కార్మికవర్గానికి కూడా వేతన రూపంలో కొంత నష్టం జరుగుతుంది. దాదాపు 13 కోట్లు నష్టపోవాల్సి వస్తుంది. ఒక్కరోజు సమ్మెతో 1.92 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతుంది. ఈ రకంగా సింగరేణిపై పెను భారం పడుతుంది కాబట్టి.. ఎట్టి పరిస్థితుల్లో కార్మిక వర్గం సమ్మెలో పాల్గొనకుండా యాజమాన్యానికి సహకరించాలని, ఉత్పత్తిపై ఫోకస్ చేయాలని సింగరేణి యాజమాన్యం చెబుతున్నా.. కార్మిక సంఘాలు మాత్రం ససేమిరా అంటున్నాయి.