
విశాఖపట్నం
విశాఖ సింహాచలం కొండ దిగువన తొలిపావంచా వద్ద నుంచి గిరిప్రదక్షి ణం ప్రారంభమైంది. స్వామి వారి నమూనా విగ్రహంతో పుష్పరథం కదిలింది. రథాన్ని ఆలయ అనువం శిక ధర్మ పూసపాటి అశోక్ గజపతి రాజు జెండా ఊపి ప్రారంభించారు. రథం వెంట లక్షలాది మంది భక్త జనం గిరి ప్రదక్షిణకు శ్రీకారం చుట్టారు.
గిరి ప్రదక్షిణ చేస్తే భూమి ప్రారక్షణ చేసిన అంత పుణ్యఫలం లభిస్తుం దని పురాణాలు చెబుతున్నాయి. అంతటి మహోన్నతమైన సింహా చలం గిరి ప్రదక్షిణ మహోత్సవానికి సమయం ఆసన్నమైంది. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా చతుర్దశి నాడు లక్షలాది మంది భక్తులు సింహగిరి ప్రదక్షిణ చేయడం ఆనవాయితీ. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసింది అధికార యంత్రంగం. గతంలో అనుభవాల నేపథ్యంలో ఎటువంటి అవాంతరాలు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ప్రత్యేక ఆషాడ పౌర్ణమి సందర్భంగా చతుర్దశి నాడు గిరిప్రదక్షిణ చేయడం ఆనవాయితీ. 32 కిలోమీటర్ల దూరం సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకుంటే కలిగే భాగ్యమే వేరని భక్తులు నమ్ముతూ ఉంటారు. సింహాచలేశ్వరుడు కొలువుదిరిన సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే భూమి ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం. అందుకే ప్రతీయేటా లక్షలాదిమంది భక్తులు కాలినడకన 32 కిలోమీటర్లు ప్రదక్షిణ చేస్తారు.