
సెక్రటేరియట్
సెక్రటేరియట్ లో రోడ్లు భవనాలు శాఖ పై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జాతీయ రహదారి 65 రోడ్డు పనుల పురోగతి పై అధికారులను ఆరా తీసారు. మదీనాగూడ నుండి సంగారెడ్డి వరకు 6లేన్ల రహాదారి విస్తరణ పనుల పురోగతి, హ్యామ్ రోడ్ల ప్యాకేజీ ల పై చర్చ జరిగింది.
ఈ సమీక్షలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్,రీజినల్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్, NH అధికారులు, ఆర్ అండ్ బి ఈఎన్సి జయ భారతి, సి.ఈ లు, ఎస్.ఈ ధర్మారెడ్డి,పలువురు ఆర్ అండ్ బి అధికారులు పాల్గోన్నారు.