
నెల్లూరు
నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డినీ చంపాలని కుట్ర చేశారని వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు. నల్లపరెడ్డి ఇంటిమీద దాడి తో నెల్లూరు జిల్లా ఉలిక్కిపడింది. ఫ్యాక్షన్ ప్రాంతంగా నెల్లూరును వేమిరెడ్డి దంపతులు ఈ ఘటనతో మార్చేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రణాళికాబద్ధంగా ఒకరి తరువాత ఒకరిపై కేసులు,దాడులు జరుగుతున్నాయి. దాడి ఘటన నేపథ్యంలో నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని కోరామని అన్నారు.
ప్రశాంతమ్మ నిన్న చేసిన వ్యాఖ్యల్లో అనేక తేడాలు ఉన్నాయి... ఆమె వ్యాఖ్యలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. - ప్రసన్న ను చంపాలనే లక్ష్యంతోనే దాడి చేసినట్లు ప్రశాంతమ్మ మాటలను బట్టి అర్థం అవుతోంది. దీనిపై ఎల్లో మీడియా కూడా ఏమాత్రం పొసగని వార్తలు ప్రసారం చేసింది. ఇంట్లోవాళ్లను భయబ్రాంతులకు గురి చేసేలా ఈ దాడులు జరిగాయి. ప్రసన్న తనకు తానే దాడులు చేయించుకున్నారని ప్రశాంతమ్మ ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అన్నారు.
సీసీ ఫుటేజీని పరిశీలిస్తే ప్రసన్నను అంతం చేయాలనే లక్ష్యం కనిపిస్తోంది. పోలీసులు వెళ్లే సమయానికి దుండగులు విధ్వంసం చేస్తుంటే కనీసం ఒకరిని కూడా పట్టుకోలేదు... ఇది నల్లపరెడ్డికి అంతం చేయాలనే కుట్రగా భావిస్తున్నాం. దీనిపై పవన్ ట్వీట్ చేయడం సిగ్గుచేటు. ఆయన ఇంట్లో మహిళలు లేరా... వాళ్ళని కూడా బెదిరిస్తే చూస్తూ ఊరుకుంటారా. దాడి సమయంలో శ్రీనివాసులురెడ్డి సతీమణి ఉంటే ఆమెని కూడా బెదిరించారు. రాజకీయాల్లో ఆదర్శంగా నిలిచిన నల్లపరెడ్డి కుటుంబానికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. టీడీపీ కన్వీనర్లు,నాయకులే దాడులు చేస్తే వారిని అరెస్టు చేయకుండా.. ప్రసన్నపై కేసులు పెట్టడం దారుణం. వేమిరెడ్డి దంపతులతో పాటు, దాడికి పాల్పడిన వారిపై కేసులు ఎందుకు పెట్టరు... కుట్రదారులపై హత్యాయత్నం కేసు పెట్టాలి. గతంలో రోజాను ఇంకా చాలామంది వైసీపీ మహిళలపై తప్పుగా మాట్లాడలేదా... మరి అప్పుడు మేము దాడులు చేయలేదు. నెల్లూరులో ఇలా దాడులు చేయడం చాలా దారుణం... కూటమి ప్రభుత్వం వచ్చింది ఇందుకేనా. ప్రసన్నపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది ప్రశాంతమ్మ.... ప్రశ్నిస్తే ఆయనపై దాడులు చేసి చంపాలని కుట్రలు చేస్తారా. - ప్రశాంతమ్మకు గౌరవించడం రాదా... ఎలా మాట్లాడాలి అనే సంస్కారం లేదా.- ప్రసన్నపై ఎలాగైతే కేసులు పెట్టారో వేమిరెడ్డి R దంపతులపై కూడా కేసులు కట్టాలని అయన అన్నారు.