
కరీంనగర్
మోదీ స్పూర్తితోనే ఈ సైకిళ్ల పంపిణీ విద్యారంగానికి ఎనలేని ప్రాధాన్యతనిస్తున్న మోదీ సర్కార్. నేనూ మీలాగే పేదరికం నుండి వచ్చిన వాడినే తిండికి ఎన్నో ఇబ్బందులు పడ్డా, మా అమ్మానాన్న ఎంతో కష్టపడి మమ్ముల్ని పెంచారు కష్టపడి ఈ స్థాయికి వచ్చిన. మీరు కూడా మీ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తు చేసుకోండి తల దించుకుని చదవండి తల ఎత్తుకునేలా ఉన్నత స్థానాల్లోకి వెళ్తారు. నా గెలుపుకు ప్రధాన కారణం చిన్నారులే 50 శాతం ఓట్లు వారి వల్లే వచ్చాయి పిల్లలపై నాపై చూపుతున్న అభిమానానికి ఏమిచ్చి రుణం తీర్చుకోను? నేను ఎంపీగా ఉన్నంత కాలం ప్రతి ఏటా టెన్త్ పిల్లలకు సైకిళ్లు అందిస్తా విద్యార్థులందరికీ మోదీ కిట్స్ కూడా అందిస్తా. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కు ప్రతీక సైకిల్: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కేంద్ర మంత్రిని సత్కరించిన ఎమ్మెల్సీ కొమరయ్య, మూకుమ్మడిగా బండి సంజయ్ కు ముందస్తుగా హ్యాపీ బర్త్ డే శుభాకాంక్షలు చెప్పిన విద్యార్థులు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో అట్టహాసంగా సైకిళ్ల పంపిణీ బండి సంజయ్ చేతులు మీదుగా సైకిళ్ల పంపిణీ ప్రారంభం. నెలరోజుల్లో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అన్ని ప్రభుత్వ స్కూళ్లలో సైకిళ్ల పంపిణీని పూర్తి చేయనున్న సంజయ్ సైకిళ్లపై రయ్ రయ్ వెళుతూ ఎంజాయ్ చేసిన విద్యార్థులు:
అంబేద్కర్ స్టేడియం నుండి ప్రతిమా చౌరస్తా వరకు సైకిల్ తొక్కుకుంటూ జై బండి సంజయన్న అంటూ నినదిస్తూ వెళ్లిన విద్యార్థులు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలోకేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ టెన్త్ చదివే విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసే కార్యక్రమానికి హాజరయ్యారు. మొత్తం 20 వేల సైకిళ్లను స్వయంగా కొనుగోలు చేసిన బండి సంజయ్ వాటిని దశల వారీగా పంపణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలుత కరీంనగర్ టౌన్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి బండి సంజయ్ తోపాటు టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, నగర పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్ అశ్వినీ, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజీపీ కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి, మాజీ మేయర్లు, డి.శంకర్, సునీల్ రావు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, ఆర్డీవో, డీఈవోతోపాటు పలువురు అధికారులు హాజరయ్యారు.