YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కల్తీ కల్లు బాధితులకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి

కల్తీ కల్లు బాధితులకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి

హైదరాబాద్.
కల్తీకల్లు తాగి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను  ఎంపీ ఈటల రాజేందర్, వడ్డేపల్లి రాజేశ్వరరావు పరామర్శించారు.
ఈటల మాట్లాడుతూ కూలిపని చేసుకొనే వారు.  కల్తీకల్లు తాగి అస్వస్థతకు గురయ్యారు.  7 మంది గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  15 మంది నిమ్స్ లో ఉన్నారు.  చాలామందివి కిడ్నీలు పాడయ్యాయు.  ఒకరు ఇంటిదగ్గరే చనిపోగా, ఇద్దరు ఆసుపత్రుల్లో చనిపోయారని సమాచారం. బాధితులందరికీ ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందించాలి.  కల్లు కల్తీ కాకుండా ప్రభుత్వం నియంత్రించాలి.  దీనిని తాగేవారంతా పేదవారని అన్నారు.
కూలిపని చేసుకొనే వారు ఉపశమనం కోసం కొంతమంది కల్లు తాగే అలవాటు ఉంటుంది.  కల్తీ కాకుండా నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ముగ్గురు చనిపోయినారని సమాచారం..  ప్రభుత్వం కప్పి పుచ్చినా దాచినా ఇది దాగదు.  ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి.  బాధితులకు వైద్యం పూర్తిగా ఉచితంగా అందించాలని డిమాండ్ చేస్తున్నాము. అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.. కల్తీ నివారించాల్సిన వారు పట్టించుకోవడం లేదు.  పది వేల కోట్లు ఆదాయం ఇప్పుడు 50  వేల కోట్లు అయ్యింది.  ఎక్కువ అమ్మాలని డిపార్ట్మెంట్ ఒత్తిడి తెస్తుంది. ఎక్సైజ్ మీద వచ్చే ఆదాయం పాజిటివ్ ఆదాయం కాదు. సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

Related Posts