YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బాబు అదిరిపోయే స్కెచ్

బాబు అదిరిపోయే స్కెచ్

విజయవాడ, జూలై 10, 
ఏపీలో కూటమి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మూడు పార్టీల కలయిక విషయంలో అనేక రకాల ఇబ్బందులు వస్తాయని నాయకత్వాలకు తెలుసు. అందుకే చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి మూడు పార్టీలు. ఇప్పుడు తెలుగుదేశం విపక్ష ఎమ్మెల్యేలు ఉన్నచోట ఇన్చార్జిల నియామకం పై దృష్టి పెట్టింది. 11చోట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలవడంతో అక్కడ టిడిపి నాయకత్వాన్ని మరింత పటిష్టం చేయాలని చూస్తోంది. ఇంకోవైపు జనసేనతో పాటు బిజెపి గెలిచిన 29 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సైతం టిడిపి ఇన్చార్జిలను నియమించేందుకు కసరత్తు ప్రారంభించింది. అయితే ఇక్కడ ఆ రెండు పార్టీల ఎమ్మెల్యేలపై దూకుడు ప్రదర్శించకుండా.. సమన్వయంతో వ్యవహరించే వారికి ఇన్చార్జులుగా నియమించాలని చూస్తోంది. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయాలు తీసుకుంటోంది.జనసేన తో పాటు బిజెపి గెలిచిన చోట్ల వైసిపి క్యాడర్ పెద్ద ఎత్తున చేరింది. అయితే వారితో ఎన్నికల సమయంలో ఇబ్బందులు తప్పవు. అందుకే క్షేత్రస్థాయిలో బలమున్న టిడిపి క్యాడర్ను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే టిడిపి అధినేత చంద్రబాబు మంచి ఆలోచన చేశారు. అక్కడ జనసేన, బిజెపి ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకునే వారికి ఇంచార్జ్ పదవులు కట్టబెట్టనున్నారు. పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో వర్మ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. అయితే అదే నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం పెద్ద ఎత్తున జనసేనలో చేరింది. వారు అప్పటి సీన్ క్రియేట్ చేసుకున్నారు. దానినే ప్రశ్నిస్తున్నారు వర్మ. అయితే అక్కడ జరుగుతున్న తప్పిదాలను సరిచేసుకునే పనిలో ఉన్నారు పవన్ కళ్యాణ్. అటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా చూడాలన్నది చంద్రబాబు ప్లాన్. అందుకే ఆ రెండు పార్టీల ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకునే.. సమర్థవంతమైన నేతలకి అక్కడ బాధ్యతలు అప్పగించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.ప్రధానంగా జనసేన ఉభయగోదావరి తో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా విజయం సాధించింది. ఆయా చోట్ల తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ ఉంది. దానిని కాపాడుకోవడం ఇప్పుడు కూటమికి ఉత్తమం. జనసేన తో పాటు బిజెపికి సీట్లు కేటాయించే నియోజకవర్గాల్లో టిడిపి కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. అది పవన్ కళ్యాణ్ తో పాటు బిజెపి నాయకత్వానికి తెలుసు. అందుకే చంద్రబాబు ఆ రెండు పార్టీల నాయకత్వాలతో ఆలోచన చేస్తున్నారు. టిడిపి ఇన్చార్జ్ ల నియామకంపై కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన ఎమ్మెల్యేలు ఉన్నచోట్ల.. వారి సిఫారసు తోనే టిడిపి ఇన్చార్జిలను నియమించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.మూడు పార్టీల మధ్య సమన్వయ లోపంతో రాజకీయంగా లబ్ధి పొందాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టి వ్యూహంతో ఉంది. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన చాలామంది నేతలు కూటమి పార్టీల వైపు వెళ్లారు. వారు వచ్చే ఎన్నికల నాటికి తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని ఒక అంచనాలు ఉన్నాయి. పేరుకే వారి కూటమి పార్టీలో చేరారు కానీ.. అక్కడ విభేదాలు సృష్టించేందుకు వెళ్లారని అనుమానాలు ఉన్నాయి. ఇటువంటి వారి విషయాన్ని ముందే గ్రహించారు సీఎం చంద్రబాబు. వారిని వలస పక్షులతో పోల్చారు. అందుకే ఇప్పుడు టిడిపి ఇన్చార్జిల నియామకంలో.. ఆ రెండు పార్టీల అభిప్రాయాలను తీసుకొనున్నారు. మూడు పార్టీల శ్రేణుల మధ్య సమన్వయ సాధనకు.. ఎటువంటి లోపాలు తలెత్తకుండా ద్వితీయ శ్రేణి నాయకులకు నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వాలని చంద్రబాబు చూస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Related Posts