YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆ ఒక్క నియోజకవర్గమేనా

ఆ ఒక్క నియోజకవర్గమేనా

విజయవాడ, జూలై 10, 
కూటమి ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది పూర్తయింది. గత ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేసి విజయం సాధించింది. అయితే జనసేన అధినేతగా పవన్ కల్యాణ్ ఎన్నికలకు ముందు ఆయా నియోజకవర్గాల్లో పర్యటించి వచ్చారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కూటమిలోని ఇతర పార్టీల అభ్యర్థుల తరుపున కూడా ప్రచారం చేసినప్పటికీ తన పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఎన్నికలకు ముందు పర్యటించిన జగన్ కనీసం గెలిచి ఏడాది గడుస్తున్నప్పటికీ ఆ నియోజకవర్గాలకు వెళ్లడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 21 శాసనసభ నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యేలు ఉంటే కనీసం అక్కడ పర్యటించేందుకు కూడా పవన్ కల్యాణ్ కు తీరికలేదా? అని ప్రశ్నిస్తున్నారు.  తాము ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లో అధికారులు తమ మాట వినడం లేదని, అక్కడ టీడీపీ ఇన్ ఛార్జుల మాటే చెల్లుబాటు అవుతుందని, తమను అధికారంలో ఉన్న వారిగా అధికారులు కూడా పరిగణించడం లేదని ఎమ్మెల్యేలు మొత్తుకుంటున్నా అటు వైపు జనసేనాని చూడకపోవడంపై పార్టీలో చర్చ జరుగుతుంది. కనీసం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రయిక్ రేటు సాధించిన తన విజయానికి కారణమైన నియోజకవర్గాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు కూడా పవన్ కల్యాణ్ సమయాన్ని వెచ్చించకపోవడంపై నేతలు నిరాశ చెందుతున్నారు. స్థానిక కార్యకర్తలు కూడా పవన్ కల్యాణ్ ను ఎప్పుడు నియోజకవర్గానికి తీసుకువస్తారని ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో తమ నియోజకవర్గాల్లో పేరుకుపోయిన సమస్యలను చెప్పుకుందామంటే పవన్ కల్యాణ్ కనీసం ఇటు వైపు చూడకపోవడమేంటన్నది ఎమ్మెల్యేలు కూడా నిరాశ చెందుతున్నారు. పవన్ కల్యాణ్ తమ నియోజకవర్గానికి ఒకసారి వచ్చి ప్రజలతో కలిసి బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రభుత్వం ఏడాది కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా వివరిస్తే బాగుంటుందని చెబుతున్నారు. ప్రజల్లో పవన్ కల్యాణ్ నోటి ద్వారా వచ్చే మాటలకు ఎక్కువ విశ్వసనీయత ఉంటుందని, తాము మరోసారి ప్రజల ఆదరాభిమానాలు చూరగొనాలన్నా, మరొకసారి ఈ నియోజకవర్గం నుంచి గెలవాలన్నా పవన్ పర్యటనలను నియోజకవర్గాల్లో చేయాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. షూటింగ్ లవల్లనేనంటూ అసలు తాను ప్రాతినిధ్యం వహించిన పిఠాపురం నియోజకవర్గానికే పవన్ కల్యాణ్ చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారని, ఇక 20 నియోజకవర్గాల్లో ఎలా పర్యటిస్తారని కొందరు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ జిల్లాల పర్యటన ఆయన గతంలో అంగీకరించిన సినిమాల షూటింగ్ ల కారణంగా వాయిదా పడుతూ వస్తుందని, త్వరలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించడానికి ప్లాన్ చే్స్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయినాసరే ఏడాదయినా ఓటేసిన తమను పట్టించుకోలేదన్న ఆవేదనలో ప్రజలు ఉన్నారని, పవన్ కల్యాణ్ కనీసం వారానికి ఒక నియోజకవర్గంలోనయినా పర్యటించాలని జనసేన ఎమ్మెల్యేలు కోరుతున్నారు. మరి పవన్ పర్యటనలు ఇకమీదైనా ఉంటాయా? లేదా? అన్నదితేలాల్సి ఉంది.

Related Posts