
నెల్లూరు, జూలై 10,
కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదైంది. మరోవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి సైతం ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ మహిళా సమాజం తరపున వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి సంఘీభావం తెలిపారు. మహిళలను కించపరిచే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భువనేశ్వరి కోరారు.నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదైంది. కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మహిళ ఫిర్యాదు ఆధారంగా నెల్లూరు జిల్లా కోవూరు పోలీసులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. బీఎన్‌ఎస్‌లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. త్వరలోనే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందికోవూరు నియోజకవర్గంలోని పడుగుపాడులో జరిగిన వైసీపీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో నల్లపరెడ్డి ప్రనన్నకుమార్‌రెడ్డి.. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనంతరం సోమవారం రాత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై కొంతమంది దాడి చేశారు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై కొందరు మూకుమ్మడిగా దాడి చేసి కారు, ఇంట్లోని ఫర్నిచర్, కుర్చీలను విరగ్గొట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ మహిళా కమిషన్‌కు సైతం ఫిర్యాదు చేశారు. తాజాగా ఓ మహిళ ఫిర్యాదు ఆధారంగా కోవూరు పోలీసులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మీద కేసు నమోదు చేశారు. త్వరలోనే విచారణకు పిలిచే అవకాశం ఉంది.నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి.. నారా భువనేశ్వరి స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా నారా భువనేశ్వరి ట్వీట్ చేశారు." కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారిపై చేసిన అవమానకరమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ కఠినమైన సమయంలో ప్రశాంతి రెడ్డి గారికి సంఘీభావం ప్రకటిస్తున్నాను. మహిళల వ్యక్తిత్వ హననం చేసే విధంగా వారు తరుచూ చేస్తున్న వ్యాఖ్యలు మహిళా సమాజంపై వారి అభిప్రాయాలు ఏంటో తెలియజేస్తున్నాయి. ఇలాంటి పోకడలను మహిళా లోకం ఎన్నటికీ క్షమించదు. ""రాజధాని రైతుల ఉద్యమ సమయంలో కావచ్చు, అమరావతి ప్రాంత మహిళలపై కావచ్చు. గతంలో ఇలాంటి దాడులు, వ్యాఖ్యలే చేశారు. అయితే స్త్రీలను ఇలాంటి పోకడల ద్వారా బలహీన పరచాలనే ప్రయత్నాలు ఫలించవు. నేటి తరం మహిళలు వీటిని తట్టుకుని మరింత దృఢంగా ముందుకు సాగుతారు అనడంలో సందేహం లేదు. అవమానకరమైన వ్యాఖ్యలు, ఆత్మగౌరవం దెబ్బతీసే చర్యలతో మహిళల విలువను, స్ఫూర్తిని విచ్ఛిన్నం చేయలేరు. స్త్రీలను గౌరవించే మన సంస్కృతిలో, దానిని దెబ్బతీసే ఏ ప్రయత్నాన్నైనా అందరూ తిప్పికొట్టాలి. ఈరోజు, రేపు, ఎప్పుడైనా సరే, స్త్రీలను కించపరిచే, నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే చర్యలను ఐక్యంగా ఎదిరించి మరింత బలంగా నిలబడదాం" అంటూ నారా భువనేశ్వరి ట్వీట్ చేశారు.