YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టచ్ మీ నాట్ అంటున్న టాలీవుడ్

టచ్ మీ నాట్ అంటున్న టాలీవుడ్

విజయవాడ, జూలై 10, 
ఏపీ సీఎం చంద్రబాబుతో టాలీవుడ్ ప్రముఖుల భేటీ ఎప్పుడు? అసలు ఆ సమావేశం ఉంటుందా? ఉండదా? స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించినా ఎందుకు సినీ ప్రముఖులు స్పందించడం లేదు? పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఏపీలో కూటమి అధికారంలోకి రావాలని సినీ పరిశ్రమ కోరుకుంది. అందుకు తగ్గట్టుగానే ప్రకటనలు వచ్చాయి. సినీ పరిశ్రమ పరోక్ష సహకారం అందింది. సినీ పరిశ్రమ కోరుకున్నట్టే ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. కానీ ఇంతవరకు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలవలేదు. స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించినా ఇంతవరకు భేటీ కార్యరూపం దాల్చలేదు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన జరుగుతూ వచ్చింది.హరిహర వీరమల్లుసినిమా విడుదల ఖరారు.. దానికి ముందే ధియేటర్ల బంద్ అంశం తెర పైకి రావడంతో పవన్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. సినీ పరిశ్రమ పెద్దలు సీఎం చంద్రబాబును కలవకపోవడం పై తప్పు పట్టారు. దీంతో తెలుగు సినీ పరిశ్రమలో కదలిక వచ్చింది. కలిసేందుకు ప్రయత్నాలు జరిగాయి. సినీ పరిశ్రమ వ్యక్తులు ఎవరెవరు సీఎం చంద్రబాబును కలవాలి అన్నది ఒక జాబితా తయారు అయ్యింది. అయితే ఆ జాబితాను కుదించే ప్రయత్నం జరిగిందని ఒక విమర్శ వచ్చింది. అందుకే చాలామంది సీఎం చంద్రబాబును కలిసేందుకు ముందుకు రాలేదని తెలుస్తోంది. షూటింగ్లలో బిజీ అని కొందరు.. వ్యక్తిగత పనులు ఉన్నాయని మరికొందరు సమాచారం ఇవ్వడంతో ఈ భేటీ వాయిదా పడుతూ వస్తున్నట్లు తెలుస్తోంది.సినీ పరిశ్రమకు చెందిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ఆదేశించిన సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు కలవకపోవడం ఏమిటనే ప్రశ్న వినిపిస్తోంది. నంది అవార్డులకు సంబంధించి తెలంగాణలో సక్సెస్ గా అందించి వారు చేసి చూపించారు. కానీ ఏపీ నుంచి ఆ ప్రయత్నం జరగడం లేదు. అయితే సినీ పరిశ్రమతో లడాయి వద్దని చంద్రబాబు భావిస్తున్నారు. సినీ పరిశ్రమ పెద్దలు వచ్చినా.. రాకపోయినా ఫర్వాలేదని.. ఈ అంశాన్ని పవన్ కళ్యాణ్ కు పరిమితం చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. అనవసరంగా సినీ పరిశ్రమతో పెట్టుకుని లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోవడం ఏమిటనేది చంద్రబాబు ఆలోచన. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయంలో సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. కొంతమంది సినీ పరిశ్రమ పెద్దలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికీ కొందరు వైసీపీ నేతలతో అంటగాకుతున్నారని అనుమానిస్తున్నారు. అందుకే నాడు స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు.మొన్న మధ్యన సినీ పరిశ్రమపెద్దలు సీఎం చంద్రబాబును కలుస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఆ సమయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాని మోదీ రాష్ట్రానికి విచ్చేశారు. అందుకే సీఎం బిజీగా ఉన్నందున తరువాత భేటీ ఉంటుందని ప్రచారం నడిచింది. అయితే నెల రోజులు గడుస్తున్నా సినీ పెద్దలు ఎవరు సీఎం చంద్రబాబును కలవకపోవడం హాట్ టాపిక్ అవుతోంది. అయితే అనవసరంగా ఏపీ ప్రభుత్వంతో సినీ పరిశ్రమకు గ్యాప్ ఏర్పడింది. దీనిని పూడ్చేందుకు ప్రయత్నాలు జరగడం లేదు. అయితే ఇప్పుడు సీఎం చంద్రబాబు మాత్రం ఈ అంశాన్ని పూర్తిగా విడిచిపెట్టడం బెటర్ అన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అనవసరంగా లేనిపోని వివాదాలు కొని తెచ్చుకోవడం కంటే విడిచిపెట్టడమే మేలని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Related Posts