YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

గ్రేట్ డాగ్..

 గ్రేట్ డాగ్..

సిమ్లా, జూలై 10, 
 హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. అయితే తాజాగా రాష్ట్రంలోని మండి జిల్లాలో జరిగిన ఓ ఘటన మానవ చరిత్రలో ఓ అద్భుతమైన ఘట్టంగా నిలుస్తోందని చెప్పవచ్చు. జిల్లాలోని సియాతి గ్రామంలో ఓ కుక్క చేసిన అలర్ట్ తో గ్రామం గ్రామమంతా ప్రాణాలతో బయటపడింది. ప్రకృతిలో ఎప్పుడు ఏం జరుగుతుందో..? ప్రకృతి వినాశనం ఎప్పుడు సంభవిస్తుందో..? జంతువులు మనుషుల కన్నా ముందే గ్రహిస్తాయని ఈ తాజా ఘటన ప్రూఫ్ చేసింది. వారి క్రితం.. జాన్ 30 అర్థరాత్రి సమయంలో సియాతి గ్రామంలో భారీ వర్షాలకు ఓ కొండచరియ విరిగిపడింది. సరిగ్గా అదే టైంలో ఓ బిల్డింగులో రెండో అంతస్తులో ఓ శునకం ఒక్కసారిగా అరవడం మొదలుపెట్టింది. అది ఎలా అంటే.. భయంకరంగా మొరగడం స్టార్ట్ చేసింది. దాని సౌండుకు ఇంటి యజమాని లేచి.. ఇంటిపైకి వెళ్లగా గోడలు పగలినట్టు కనిపిస్తోంది. అంతే కాదు.. ఇంట్లోకి వరదనీరు చేరింది. కుక్క సంకేతాన్ని యజమాని సీరియస్ గా తీసుకుని మంచి పనిచేశాడు. వేగంగా కుక్కను తీసుకెళ్లి.. ఇతర స్థానికులందరినీ లేపి.. అలర్ట్ చేశాడు. గ్రామస్థులందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించాడు. అంతే.. క్షణాల్లోనే కొండచరియలు విరిగిపడ్డాయి. ఊళ్లో ఇళ్లన్నీ ధ్వంసం అయ్యాయి. దాదాపు 63 మంది ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. కుక్క అలర్ట్ తో వారు ప్రాణాలు దక్కాయి. ఈ సంఘటనతో కొన్ని ఇళ్లు మాత్రమే దెబ్బతినకుండా ఉన్నాయి. ఎక్కువ శాతం ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ప్రస్తుతం ఆ ఊరు ప్రజలందరూ పక్క గ్రామం తియంబాలాలోని నైనా దేవీ టెంపుల్ లో ఉంటున్నారు. అక్కడ ఆశ్రయం పొందుతున్నారు. చాలా మంది బాధితులు తమ ఆస్తులను కోల్పోయి.. తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నానా ఇబ్బందులు పడ్డారు. కొందరికి అధిక రక్తపోటు సమస్య తలెత్తింది. అయినప్పటకీ ఆ కుక్క వల్ల వాళ్లు ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో వారు ఆ కుక్కను దేవుడిగా ప్రార్థిస్తున్నారు. అదే జిల్లాలో తునాగ్ అనే ప్రాంతంలో ఓ కో-ఆపరేటివ్ బ్యాంక్ కూడా వరద నీటితో పూర్తిగా మునిగిపోయింది. బ్యాంకులో ఉన్న డబ్బులు, గోల్డ్, ఇతర విలువైన డాక్యుమెంట్స్ కంటికి కనబడకుండా పోయాయి. వాటిని గుర్తించేందుకు అధికారులతో పాటు గ్రామస్థులు గాలిస్తున్నారు. అయినప్పటికీ లాభం లేకపోయింది, సియాతి గ్రామంలో ఆ కుక్క చేసిన సంకేతంతో ఆ గ్రామ ప్రజలందరూ ప్రాణాలతో బయటపడ్డారు. జంతువులు మనకంటే ముందే ప్రమాదాలను గుర్తించగలవని ఈ కుక్కతో మరోసారి ప్రూఫ్ అయ్యింది. ఆ కుక్క చేసిన సహాయాన్ని ఆ గ్రామ ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరు. జీవితాంత గుర్తు పెట్టుకుంటారు. ఒక్కసారి ఆ కుక్క అరుపు వినకపోయినా, పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో మనం ఊహించుకోవచ్చు. ఈ సంఘటన మనకు మరోసారి మనకు గుర్తు చేస్తోంది. ప్రకృతతో పాటు మనం జంతువుల సంకేతాలను కూడా గౌరవించాలని తెలియజేస్తుంది. ఏదేం అయినప్పటికీ పెంపుడు జంతువులను మంచిగా చూసుకుందాం.. అవి మనకు ఎప్పటికీ మంచే చేస్తాయి.

Related Posts