
హైదరాబాద్
హీరో విజయ్ దేవరకొండ కేసు విచారణకు కమిషనర్ రాకుండా ఏసీపీ రావడం పట్ల జాతీయ ఎస్టీ కమిషన్ అసహనం వ్యక్తం చేసారు. ఏప్రిల్ 26వ తేదీన రెట్రో సినిమా వేడుకలో గిరిజనుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విజయ్ దేవరకొండపై రాయదుర్గం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. ఇదే అంశంపై జాతీయ ఎస్టీ కమిషన్ కు కూడా ఫిర్యాదు చేయడంతో, కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ విచారణ చేపట్టారు. ఈ నేపధ్యంలో విచారణకు హాజరు కావాలని కమిషనర్ కు నోటీసులు ఇస్తే మీరెందుకు వచ్చారు, ఆ మాత్రం తెలియదా అంటూ మాదాపూర్ ఏసీపీ పట్ల హుస్సేన్ నాయక్ అసహనం వ్యక్తం చేసారు. మరో 15 రోజుల్లో హైదరాబాద్ కమిషనర్ విచారణకు హాజరు అవ్వకపోతే, డీజీపీని విచారణకు రప్పించాల్సి ఉంటుందని ఏసీపీని హెచ్చరించారు.