
హైదరాబాద్
హెచ్సీఏ అధ్యక్ష ఎన్నికల్లో జగన్మోహన్రావు నకిలీ పత్రాలు సమర్పించినట్లు పోలీసులు నిర్దారించారు. జగన్మోహన్రావు శ్రీ చక్ర క్రికెట్ క్లబ్ పేరుతో నకిలీ పత్రాలు సృష్టించారు. గౌలీపురా క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ సి కృష్ణ యాదవ్ సంతకం ఫోర్జరీ అయింది. కృష్ణ యాదవ్ సంతకాన్ని శ్రీ చక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవిత ఫోర్జరీ చేసినట్లు సమాచారం. ఫోర్జరీ పత్రాలను జగన్మోహన్రావుకు కవిత అందించింది. నకిలీ పత్రాలుతోనే జగన్మోహన్రావు హెచ్సీఏ అధ్యక్షుడిగా ఎన్నికైయాడు. హెచ్సీఏ నిధులు దుర్వినియోగం చేశారని జగన్ మోహన్ రావు పై అభియోగం నమోదయింది. నిధులు దుర్వినియోగంపై టి సి ఏ అధ్యక్షుడు గురువారెడ్డి సిఐడి కి ఫిర్యాదు చేసారు. దాంతొఓ సిఐడి అధికారులు దర్యాప్తు చేపట్టి హెచ్ సి ఏ లో అక్రమాలు గుర్తించారు. జగన్మోహన్రావుకు కోశాధికారి శ్రీనివాసరావు సీఈవో సునీల్ సహకరించినట్లు ఆధారాలు లభించాయి. దాంతో జగన్మోహన్రావు ,శ్రీనివాసరావు, సునీత్, రాజేంద్ర యాదవ్, కవిత అరెస్ట్ అయ్యారు. .