
కొత్తచెరువు
శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో మెగా పీటీఎం 2.0 కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధిపొందిన తల్లులు, విద్యార్థులతో ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ ముఖాముఖి అయ్యారు. అనంతరం విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు పరిశీలించి విద్యార్థులు, తల్లిదండ్రులకు సీఎం పలు సూచనలిచ్చారు. డిజిటల్ తరగతి గదిలో విద్యార్థులతో ముఖ్యమంత్రి ముచ్చటించారు. సహజ వనరులు, పునరుద్పాదక వనరుల గురించి విద్యార్ధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పాఠం చెప్పారు.